ISRO-Bhagavad Gita: అంతరిక్షంలోకి భగవద్గీత.. భారత జాతి గొప్పతనానికి ఇది మచ్చుతునక.. జయహో ఇండియా

ప్రయత్నం ఎప్పటికి వృధా పోదు.. వైఫల్యం శాశ్వతంగా ఉండదు.. కొన్ని సార్లు చిన్న ప్రయత్నం.. నీకు ఉన్నత స్థానాన్ని కల్పిస్తుంది ఇది గీత సారం.. దీనిని అన్వయించుకుంది ఇస్రో సంస్థ. ఈరోజు అంతరిక్ష పరిశోధనల్లో ప్రపంచ దేశాలు...

  • Surya Kala
  • Publish Date - 2:05 pm, Tue, 16 February 21
ISRO-Bhagavad Gita: అంతరిక్షంలోకి భగవద్గీత.. భారత జాతి గొప్పతనానికి ఇది మచ్చుతునక.. జయహో ఇండియా

ISRO-Bhagavad Gita: ప్రయత్నం ఎప్పటికి వృధా పోదు.. వైఫల్యం శాశ్వతంగా ఉండదు.. కొన్ని సార్లు చిన్న ప్రయత్నం.. నీకు ఉన్నత స్థానాన్ని కల్పిస్తుంది ఇది గీత సారం.. దీనిని అన్వయించుకుంది ఇస్రో సంస్థ. ఈరోజు అంతరిక్ష పరిశోధనల్లో ప్రపంచ దేశాలు మన దేశం వైపు చుస్తున్నాయంటే దానికి ఇస్రో శాస్త్రజ్ఞుల కృషి ఫలితమే.. అయితే ఈ యాభైఏడేళ్ల ఇస్రో ప్రయాణంలో ఎన్నో కష్టనష్టలను ఎదుర్కొంది..తడబడుతూ మొదలు పెట్టిన భారత అంతరిక్ష పరిశోధన ప్రయాణం ఈరోజు ఖగోళం వైపు చూస్తున్నాయి.. చందమామలో అడుగు పెట్టడానికి ఇస్రో చేసిన ప్రయత్నాలను ప్రయోగం పై ప్రపంచ దేశాలు ఆశ్చర్యపోయాయి. ఏ మాత్రం వసతులు, పనిముట్లు లేకపోయినా.. భారత్ చందమామ కలలు కనడంపై నవ్వుకున్నాయి.. ఆ దేశాలే ఈరోజు ఇస్రో చేస్తోన్న ప్రయోగాలపై హర్షం వ్యక్తం చేస్తున్నాయి.. శభాష్ అంటూ మెచ్చుకుంటున్నాయి.. ఈ నేపథ్యంలో ఇస్రో 57 ఏళ్ల చరిత్రలో మొట్టమొదటిసారిగా ఈ నెల 28న దేశీయ ప్రైవేటు సంస్థల ఉపగ్రహాలను నింగిలోకి పంపేందుకు సన్నాహాలు చేస్తోంది.

నెల్లూరు జిల్లాలోని షార్ నుంచి పీఎస్‌ఎల్‌వీ-సి51 రాకెట్ ను అంతరిక్షంలోకి ఫిబ్రవరి నెలాఖరులో పంపనుంది. ఈ పీఎస్‌ఎల్‌వీ బ్రెజిల్‌కు చెందిన అమెజానియా-1 సహా భారత ప్రైవేటు సంస్థలు రూపకల్పన చేసిన ఆనంద్‌, సతీశ్‌ ధవన్‌, యూనిటీశాట్‌ ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెట్టనున్నారు.

భారత్‌కు చెందిన ఉపగ్రహాల్లో ఆనంద్‌ను బెంగళూరుకు చెందిన అంకుర సంస్థ పిక్సెల్‌ రూపకల్పన చేసింది. ఇక సతీశ్‌ ధవన్‌ ఉపగ్రహాన్ని చెన్నైకు చెందిన స్పేస్‌ కిడ్జ్‌ ఇండియా రూపకల్పన చేయగా.. యూనిటీ శాట్‌ను జిట్‌శాట్‌ ను పెరంబూదురు, జీహెచ్‌ఆర్‌సీఈ శాట్‌ ను నాగ్‌పుర్ , శ్రీశక్తి శాట్‌ ను కోయంబత్తూరు కళాశాలల విద్యార్థులు తయారు చేశారు.

ఇస్రో మాజీ ఛైర్మన్‌ సతీశ్‌ ధవన్‌ పేరుపై స్పేస్‌ కిడ్జ్‌ ఇండియా సతీశ్‌ ధవన్‌ శాట్‌ ఉపగ్రహాన్ని రూపొందించింది. స్పేస్‌ కిడ్జ్‌ తొలిసారిగా ఆర్బిట్‌లోకి ఉపగ్రహాన్ని పంపనుండటంతో ఓ ప్రత్యేకత ఉండాలని ఇస్రో శాత్రవేత్తలు భావించారని డాక్టర్ కేసన్ చెప్పారు.

అంతరిక్షంలోకి పంపబడే వారి పేర్లను పంపమని మేము ప్రజలను కోరగా పలు పేర్లు ప్రస్తావించారని.. ఆ పేర్లనుంచి కొన్నింటిని ఎంచుకున్నామని తెలిపారు. ఇకహిందూ ధర్మానికి ప్రతీకగా భావించే భగవద్గీత తో పాటు ప్రధాని నరేంద్రమోదీ చిత్రపటాన్ని ఉపగ్రహంలో పంపుతున్నామని చెప్పారు. మోడీ పేరు, ఫొటో, దాని కింద ఆత్మ నిర్భర్‌ మిషన్‌ అనే పదాలతో పాటు 25 వేల మంది పేర్లను కూడా పంపే ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. వాటిల్లో 25 వేల పేర్లు ఉన్నాయని.. అందులో వెయ్యి మంది విదేశీయులవికాగా, చెన్నైలోని ఓ పాఠశాలకు చెందిన విద్యార్థుల పేర్లు ఉన్నాయని కేసన్ చెప్పారు.

Also Read:

Madhyapradesh Accident: మధ్యప్రదేశ్‌ ఘోర బస్సు ప్రమాదంపై స్పందించిన అమిత్‌ షా.. కార్యక్రమం రద్దు

ఇన్ఫ్రా రంగంలో బడ్జెట్ నిబంధనలను సమర్థవంతంగా అమలు చేయడానికి వెబ్‌నార్.. సాయంత్రం 4గం. ప్రసంగించనున్న ప్రధాని మోడీ