Madhyapradesh Accident: మధ్యప్రదేశ్‌ ఘోర బస్సు ప్రమాదంపై స్పందించిన అమిత్‌ షా.. కార్యక్రమం రద్దు

Madhyapradesh Accident: మధ్యప్రదేశ్‌లోని సిధి జిల్లాలో పట్నా సమీపంలో బ్రిడ్జిపై బస్సు నదిలో పడిపోవడంతో 28 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఘటనపై కేంద్ర...

Madhyapradesh Accident: మధ్యప్రదేశ్‌ ఘోర బస్సు ప్రమాదంపై స్పందించిన అమిత్‌ షా.. కార్యక్రమం రద్దు
Follow us
Subhash Goud

|

Updated on: Feb 16, 2021 | 1:06 PM

Madhyapradesh Accident: మధ్యప్రదేశ్‌లోని సిధి జిల్లాలో పట్నా సమీపంలో బ్రిడ్జిపై బస్సు నదిలో పడిపోవడంతో 28 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఘటనపై కేంద్ర హోంశాఖమంత్రి అమిత్‌షా విచారం వ్యక్తం చేశారు. మధ్యప్రదేశ్‌లో జరిగే హౌస్‌ వార్మింగ్‌ వేడుకలను ప్రభుత్వం రద్దు చేసింది. ఈ కార్యక్రమానికి హోం మంత్రి అమిత్‌ షా హాజరు కావాల్సి ఉండగా, ఈ ప్రమాదం సందర్భంగా కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నారు. ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన (పీఎంఎవై) పథకం కింద మధ్యప్రదేశ్‌లో నిర్మించిన లక్షకుపైగా ఇళ్లను నిర్మించారు. అయితే ఈ కార్యక్రమానికి అమిత్‌ షా వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పాల్గొనాల్సి ఉండేది. ఇలాంటి విషాద ఘటన జరగడంతో అమిత్‌ షా కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రమాదంపై అమిత్‌ షా ఆరా తీస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకుంటున్నారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు. గాయపడ్డ వారికి మెరుగైన చికిత్స అందించేలా చర్యలు చేపట్టాలని ఆయన అధికారులను ఆదేశించారు.

కాగా, ఈ ప్రమాదం జరిగిన బస్సులో 60 మంది ప్రయాణికులున్నట్లు సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు, స్థానికులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ముమ్మ రం చేశారు. ఏడుగురిని బస్సులోంచి సురక్షితంగా కాపాడారు. అయితే ప్రమాదంలో మృతి చెందిన 28 మంది మృతదేహాలను వెలికి తీశారు పోలీసులు.

Also Read: మధ్యప్రదేశ్‌లో ఘోర ప్రమాదం.. నదిలోకి దూసుకెళ్లిన బస్సు.. 28 మంది దుర్మరణం.. సహాయక చర్యలు ముమ్మరం