గ్రెటా థన్‌బర్గ్ – దిశారవి చాటింగ్, ఖలిస్తాన్ సపోర్టర్స్ తోనూ లింకులు, టూల్‌కిట్‌కు షంతను, దిశ, నికిత అడ్మిన్‌లు.!
Toolkit case : టూల్ కిట్ కేసుకు సంబంధించి కొత్త కోణాలు వెలికి తీస్తున్నారు ఢిల్లీ పోలీసులు. తాజాగా జనవరి 26 కిసాన్ ట్రాక్టర్స్ పరేడ్ హింసకు..
Toolkit case : టూల్ కిట్ కేసుకు సంబంధించి కొత్త కోణాలు వెలికి తీస్తున్నారు ఢిల్లీ పోలీసులు. తాజాగా జనవరి 26 కిసాన్ ట్రాక్టర్స్ పరేడ్ హింసకు సంబంధించి గ్రెటా థన్‌బర్గ్ – దిశారవి చాటింగ్ అంశాన్ని నిగ్గుతేల్చారు. ఖలిస్తాన్ సపోర్టర్స్ తోనూ వీరికి లింకులు ఉన్నట్టు దర్యాప్తులో నిర్ధారించుకున్నారు. టూల్‌కిట్‌కు షంతను, దిశ, నికిత అడ్మిన్‌లు గా ఉన్నట్టు ఢిల్లీ పోలీసులు తేల్చారు. జనవరి 26న కిసాన్ పరేడ్ టూల్‌కిట్ కేసు ఇన్వెస్టిగేషన్‌లో ఇవాళ మరింత స్పీడ్ పెంచారు ఢిల్లీ పోలీసులు. 26న కిసాన్ పరేడ్‌లో షంతను పాల్గొన్నారని, 20 నుంచి 27 వరకు టిక్రీ బోర్డర్‌లోనే ఉన్నట్లు తేల్చారు. మరోవైపు నికితా జాకబ్, షంతనుపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసిన పోలీసులు, వారి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. ఐతే తనకు నాలుగు వారాల పాటు వెసులుబాటు కల్పించాలంటూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు నికిత.