National: మీ భర్తలు మద్యం మానట్లేదా.? ఇలా చేయండి.. మహిళలకు మంత్రి వెరైటీ సూచన

మద్యపానం మనుషుల ఆరోగ్యాలనే కాకుండా కుటుంబ వ్యవస్థలను సైతం చిన్నాభిన్నం చేస్తాయని తెలిసిందే. ఆర్థికంగా, ఆరోగ్యంగా దెబ్బతీయడే కాకుండా కుటుంబాల్లో చిచ్చు రాజేస్తుంది. తాగుడుకు అలవాటు అయిన భర్తలతో భార్యలు ఎంతలా ఇబ్బందులు పడతారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దీంతో తమ భర్తలను తాగుడు మాన్పించాలని...

National: మీ భర్తలు మద్యం మానట్లేదా.? ఇలా చేయండి.. మహిళలకు మంత్రి వెరైటీ సూచన
Representative Image
Follow us

|

Updated on: Jun 29, 2024 | 2:15 PM

సమాజంలో కీలక స్థానంలో ఉన్న వ్యక్తులు చేసే వ్యాఖ్యలు సాధారణంగానే వైరల్‌ అవుతుంటాయి. మరీ ముఖ్యంగా సినిమా, రాజకీయ రంగాలకు చెందిన వారు చేసే వ్యాఖ్యలు దుమారం రేపిన సందర్భాలు ఎన్నో చూశాం. వారు ఏ ఉద్దేశంతో చేస్తారో తెలియదు కానీ అవి కాస్త ట్రెండ్ అవుతుంటాయి. మరీ ముఖ్యంగా ప్రస్తుత సోషల్‌ మీడియా యుగంలో ఇలాంటివి క్షణాల్లో వైరల్ అవుతున్నాయి. తాజాగా ఓ మంత్రి చేసిన వ్యాఖ్యలు ఇలాగే ట్రెండ్‌ అవుతున్నాయి. ఇంతకీ అసలు స్టోరీ ఏంటో తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే.

మద్యపానం మనుషుల ఆరోగ్యాలనే కాకుండా కుటుంబ వ్యవస్థలను సైతం చిన్నాభిన్నం చేస్తాయని తెలిసిందే. ఆర్థికంగా, ఆరోగ్యంగా దెబ్బతీయడే కాకుండా కుటుంబాల్లో చిచ్చు రాజేస్తుంది. తాగుడుకు అలవాటు అయిన భర్తలతో భార్యలు ఎంతలా ఇబ్బందులు పడతారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దీంతో తమ భర్తలను తాగుడు మాన్పించాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే తాజాగా మధ్యప్రదేశ్‌కు చెందిన మంత్రి నారాయణ్‌ సిగ్ కుశ్వాహా భర్తలను ఎలా తాగుడు మాన్పించాలో చెప్పేందుకు ఓ వెరైటీ సూచన చేశారు.

మద్యపానం, మాదక ద్రవ్యాల వాడకాన్ని అరికట్టే లక్ష్యంతో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి ఈ సూచన చేశారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ్‌ సింగ్ మాట్లాడుతూ.. మహిళలు తమ ఇంట్లోని పురుషులు మద్యం మానేయాలని అనుకుంటున్నారా.? అయితే ముందుగా వారిని బయట తాగొద్దని చెప్పండి. అదే మద్యాన్ని ఇంటికి తెచ్చుకొని తాగమని చెప్పండి. అది కూడా మీ ముందే కూర్చొని తాగమని చెప్పండి. వారు కుటుంబసభ్యుల ముందు తాగితే.. ఆ అలవాటు వారిలో క్రమంగా తగ్గడం ప్రారంభం అవుతుంది అని సూచించారు.

Narayan Singh Kushwaha

ఇలా చేయడం వల్ల వారు కొన్ని రోజుల్లోనే మద్యానికి పూర్తిగా దూరమవుతారన్న మంత్రి.. తమ భార్యాపిల్లల ముందు తాగడానికి సిగ్గుపడతారు. దానిని పిల్లలు చూస్తే వారు కూడా అదే దారిలో నడిచే ప్రమాదం ఉంటుందని వారికి గుర్తుచేయండి. ఈ పద్ధతి బాగా పని చేయొచ్చు అని సూచించారు. దీంతో మంత్రి చేసిన ఈ వ్యాఖ్యలపై పలువురు పాజిటివ్‌గా స్పందిస్తే మరికొందరు మాత్రం వ్యతిరేకిస్తున్నారు. మంత్రి ఉద్దేశం మంచిదే అయినా.. ఇలా చేయడం వల్ల ఇల్లు గృహ హింసకు కేంద్రంగా మారుతుదంటూ వ్యాఖ్యానిస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..