అయ్యో రామా.! ఆస్పత్రి పిల్లల వార్డులో విచిత్ర శబ్దాలు.. ఏంటా అని చూడగా షాక్!
ఆసుపత్రులు అంటేనే పరిశుభ్రమైన వాతావరణంలో ఉండాలి. కానీ మధ్యప్రదేశ్‌లోని ఆసుపత్రుల పరిస్థితులు మాత్రం ఇందుకు విరుద్ధంగా ఉన్నాయి. ఏకంగా ఒక ఆసుపత్రిలోని పిల్లల వార్డులో ఎలుకలు విచ్చలవిడిగా తిరుగుతున్నాయి. ఇండోర్‌లోని అతిపెద్ద ప్రభుత్వ ఆసుపత్రి మహారాజా యశవంతరావు ఆసుపత్రిలో ఎలుకల బెడద తీవ్ర సమస్యగా మారింది.

ఆసుపత్రులు అంటేనే పరిశుభ్రమైన వాతావరణంలో ఉండాలి. కానీ మధ్యప్రదేశ్‌లోని ఆసుపత్రుల పరిస్థితులు మాత్రం ఇందుకు విరుద్ధంగా ఉన్నాయి. ఏకంగా ఒక ఆసుపత్రిలోని పిల్లల వార్డులో ఎలుకలు విచ్చలవిడిగా తిరుగుతున్నాయి. ఇండోర్‌లోని అతిపెద్ద ప్రభుత్వ ఆసుపత్రి మహారాజా యశవంతరావు ఆసుపత్రిలో ఎలుకల బెడద తీవ్ర సమస్యగా మారింది. ఆసుపత్రిలో ఎక్కడపడితే అక్కడ ఎలుకలు సంచారం చేస్తున్నాయి. ఇప్పుడు పిల్లల వార్డులో తిరుగుతూ శిశువులను కొరికేశాయి. దీంతో తల్లిదండ్రులు ఆసుపత్రిలో పరిశుభ్రత, నిర్వహణపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మధ్యప్రదేశ్‌లోని అతిపెద్ద ఆసుపత్రిలో చేరిన ఇద్దరు నవజాత శిశువుల చేతులను ఎలుకలు కొరికిన షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనతో ఆసుపత్రి సిబ్బంది ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అయితే, ఇద్దరు పిల్లలు ప్రమాదం నుండి బయటపడ్డారని వైద్యులు తెలిపారు. వారికి చికిత్స అందిస్తున్నామన్నారు. ఇద్దరు పిల్లలు కేవలం మూడు రోజుల క్రితమే జన్మించినట్లు సమాచారం. ఇండోర్‌లోని అతిపెద్ద ప్రభుత్వ ఆసుపత్రి మహారాజా యశవంతరావు (ఎంవై) ఆసుపత్రిలో ఎలుకల అరాచకం ఆగడం లేదు. ఆసుపత్రి యాజమాన్యం ఇప్పటివరకు 12 వేల కంటే ఎక్కువ ఎలుకలను చంపినట్లు చెబుతోంది. ఇందుకోసం వేల రూపాయలను ఖర్చు చేసింది. అయినప్పటికీ ఆసుపత్రి ప్రాంగణంలో ఎలుకలు ఏమాత్రం తగ్గడం లేదు.
తాజాగా వెలుగులోకి వచ్చిన ఘటన షాకింగ్‌గా మారింది. శిశు వార్డులో చేరిన ఇద్దరు నవజాత శిశువులపై ఎలుకలు దాడి చేసి అవయవాలను కొరికేశాయి. ఒక శిశువు చేతికి తీవ్ర గాయం కాగా, మరొకరి భుజంపై గాయమైంది. ఈ ఘటన తరువాత తల్లిదండ్రుల్లో ఆగ్రహం, ఆందోళన నెలకొంది. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలో నవజాత శిశువుల బాక్స్‌లో ఎలుకలు తిరుగుతున్న దృశ్యాలు స్పష్టంగా కనిపించాయి.
వీడియో చూడండి..
ఈ ఘటన వెలుగులోకి వచ్చిన తరువాత ఎంజీఎం మెడికల్ కాలేజ్ డీన్ డాక్టర్ అర్వింద్ ఘనఘోరియా దర్యాప్తు కమిటీని ఏర్పాటు చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అయితే ఇప్పటివరకు తీసుకున్న చర్యలు లేమిని ఆసుపత్రి యాజమాన్యం, అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనబడుతుంది. నవజాత శిశువుల ప్రాణాలకే ముప్పు ఉన్నప్పుడు సంబంధిత అధికారులు ఇంకా ఎప్పటివరకు కళ్ళు మూసుకుంటారు అన్నది పెద్ద ప్రశ్న..!
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




