షాకింగ్.. రాజ్యసభ ఓటింగ్‌లో పాల్గొన్న బీజేపీ ఎమ్మెల్యేకి పాజిటివ్..
మధ్యప్రదేశ్‌లో శుక్రవారం నాడు జరిగిన రాజ్యసభ ఎన్నికల ఓటింగ్ గురించి తెలిసిందే. ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యేకి కరోనా పాజిటివ్ ఉన్నప్పటికీ.. పీపీఈ కిట్ ధరించుకుని వచ్చి మరి తన ఓటు హక్కును...

మధ్యప్రదేశ్‌లో శుక్రవారం నాడు జరిగిన రాజ్యసభ ఎన్నికల ఓటింగ్ గురించి తెలిసిందే. ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యేకి కరోనా పాజిటివ్ ఉన్నప్పటికీ.. పీపీఈ కిట్ ధరించుకుని వచ్చి మరి తన ఓటు హక్కును వినియోగించుకుని వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే సదరు ఎమ్మెల్యే ఓటు వేసిన తర్వాత.. ఆ ప్రాంతాన్ని అంతా శానిటైజ్ చేశారు. అయితే శుక్రవారం నాడు ఓటింగ్‌లో పాల్గొన్న ఓ బీజేపీ ఎమ్మెల్యేకి కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో ఆయనతో సన్నిహితంగా ఉన్న ఎమ్మెల్యేలంతా ఇప్పుడు టెన్షన్ పడుతున్నారు. సదరు బీజేపీ ఎమ్మెల్యే ఓటు వినియోగించుకున్న తర్వాత.. మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, మాజీ సీఎం కమల్ నాథ్ కూడా ఓటు వేశారు.