హోమ్ ఐసోలేషనా..? ఇన్స్‌టిట్యూషనల్ క్వారెంటైనా..?
కోవిద్-19 విజృంభిస్తోంది. భారత్ లో రోజురోజుకు పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఢిల్లీలో కరోనా విలయతాండవం చేస్తోంది. అయితే ఢిల్లీ ప్రభుత్వానికి, ఆ రాష్ట్ర గవర్నర్ మధ్య .. కోవిడ్ సమస్య

కోవిద్-19 విజృంభిస్తోంది. భారత్ లో రోజురోజుకు పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఢిల్లీలో కరోనా విలయతాండవం చేస్తోంది. అయితే ఢిల్లీ ప్రభుత్వానికి, ఆ రాష్ట్ర గవర్నర్ మధ్య .. కోవిడ్ సమస్య ఎదురైంది. కోవిడ్ లక్షణాలు లేని వారిని కూడా కచ్చితంగా అయిదు రోజుల పాటు ఇన్స్‌టిట్యూషనల్ క్వారెంటైనలో ఉంచాలని గవర్నర్ బైజాల్ తెలిపారు. దీనిని ఢిల్లీ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. లక్షణాలు లేని వారిని కూడా ఇన్స్‌టిట్యూషనల్ క్వారెంటైన్ చేయడం వల్ల వైద్యులపై భారం పడుతుందని ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఆరోపించారు.
వివరాల్లోకెళితే.. దేశ రాజధానిలో ప్రస్తుతం 27,512 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. వీరిలో 10,490 మంది హోం క్వారంటైన్‌లో ఉన్నారు. అయితే లెఫ్టినెంట్ గవర్నర్ తాజా నిర్ణయంతో హోంక్వారంటైన్‌లో ఉన్న 10,490 మంది పరిస్థితి అగమ్యగోచరంగా తయారయ్యింది. వీరిని హోంక్వారంటైన్‌లో కొనసాగిస్తారా లేక ప్రభుత్వ క్వారంటైన్‌కు తరలిస్తారా అనేది ప్రశ్నార్థకంగా మారింది. అయితే వీరిని ప్రభుత్వ క్వారంటైన్‌కు తరలించేందుకు ఢిల్లీలో తగిన వైద్య సదుపాయాలు లేవని తెలుస్తోంది.