సామాన్యులపై మళ్ళీ గ్యాస్ ధరల వడ్డింపు..పెరిగిన రేట్లతో ప్రధాన నగరాల్లో గ్యాస్ సిలెండర్ల ధరలు ఎలా ఉన్నాయంటే..!

దేశంలో ఎల్‌పిజి గ్యాస్ ధరలను మళ్లీ పెంచారు. మన దేశంలో దాదాపు ప్రతి కుటుంబానికి ఎల్‌పిజి కనెక్షన్ ఉంది. అంతేకాదు గ్యాస్ అనేది కుటుంబానికి అత్యంత ఉపయోగాన్ని ఇచ్చే నిత్యావసర వస్తువుగా మారిపోయింది. దీంతో ఎల్‌పిజి ధరల పెరుగుదల..

సామాన్యులపై మళ్ళీ గ్యాస్ ధరల వడ్డింపు..పెరిగిన రేట్లతో ప్రధాన నగరాల్లో గ్యాస్ సిలెండర్ల ధరలు ఎలా ఉన్నాయంటే..!
Surya Kala

|

Feb 10, 2021 | 6:56 PM

LPG Rates Hiked:దేశంలో ఎల్‌పిజి గ్యాస్ ధరలను మళ్లీ పెంచారు. మన దేశంలో దాదాపు ప్రతి కుటుంబానికి ఎల్‌పిజి కనెక్షన్ ఉంది. అంతేకాదు గ్యాస్ అనేది కుటుంబానికి అత్యంత ఉపయోగాన్ని ఇచ్చే నిత్యావసర వస్తువుగా మారిపోయింది. దీంతో ఎల్‌పిజి ధరల పెరుగుదల సాధారణ ప్రజల జీవితాలపై ప్రభావం చూపిస్తుంది. ఇక దేశంలోని మెట్రో నగరాలైన ఢిల్లీ, ముంబై, కోల్ కతా, చైన్నైల్లో గ్యాస్ ధరలు ఏవిధంగా ఉన్నాయో తెలుసుకుందాం..! దేశ రాజధాని ఢిల్లీ, ఆర్ధిక రాజధాని ముంబై లో సబ్సిడీ లేని ఎల్‌పిజి 14.2 కిలోల గ్యాస్ సిలిండర్ ఇప్పుడు రూ. 719 లకు లభిస్తుందని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ తెలిపింది.

గతంలో గ్యాస్ సిలెండర్ ధరలు ఢిల్లీలో, ముంబైలలో రూ .694, కోల్‌కతాలో రూ .720.50, చెన్నైలో రూ .710 లుగా ఉండేవి . తాజాగా పెంచిన ధరలతో ఈ మెట్రో నగరాల్లో గ్యాస్ సిలెండర్ ధరలు భారీగా పెరిగాయి. ప్రస్తుతం ధరల పెంపు తరువాత ఎల్పీజీ సిలిండర్ ధర (14.2 కిలోలు) దేశ రాజధాని ఢిల్లీలో రూ. 719కి చేరగా.. కోల్‌కతాలో రూ.745.50, ఆర్థిక రాజధాని ముంబైలో రూ.719, చెన్నైలో రూ.735కి చేరింది.

2020 డిసెంబర్‌లో, చమురు కంపెనీలు రెండుసార్లు ఎల్‌పిజి ధరలను ( LPG prices ) పెంచాయి. జనవరి 2021 లో ఎల్‌పిజి ధరలను సవరించలేదు కనుక ఫిబ్రవరి 2021 లో చమురు కంపెనీలు ఎల్‌పిజి ధరలను పెంచుతాయని ఊహించినట్టుగానే నేడు ఎల్పీజీ సిలిండర్ల ధరలు పెరిగాయి. ఈ గ్యాస్ సిలెండర్ ధరలు అంతర్జాతీయ ఇంధన ధరలు, యుఎస్ డాలర్-రూపాయి మార్పిడి రేట్ల ఆధారంగా ధరలు పెరుగుతాయి లేదా తగ్గుతాయి.

Also Read:

భారత్-చైనా వివాదం.. సరిహద్దుల్లో సైనికుల మోహరింపుపై సంచలన ప్రకటన చేసిన చైనా రక్షణ శాఖ..

కరోనా నిబంధనలు పక్కకు పెట్టి.. మాస్క్ తోనే కేక్ తినడానికి పాక్ మంత్రి ఆరాటం…వైరల్ వీడియో

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu