India-China Borders: భారత్-చైనా వివాదం.. సరిహద్దుల్లో సైనికుల మోహరింపుపై సంచలన ప్రకటన చేసిన చైనా రక్షణ శాఖ..
India-China Boarders: భారత్-చైనా సరిహద్దు వివాదంపై చైనా రక్షణ శాఖ మంత్రి సంచలన ప్రకటన చేసింది. తూర్పు లద్దాఖ్‌లో పాంగాంగ్..
India-China Borders: భారత్-చైనా సరిహద్దు వివాదంపై చైనా రక్షణ శాఖ మంత్రి సంచలన ప్రకటన చేసింది. తూర్పు లద్దాఖ్‌లో పాంగాంగ్ సరస్సు నుంచి తమ బలగాలను వెనక్కి తీసుకున్నట్లు చైనా రక్షణ శాఖ ప్రకటించింది. ఈ మేరకు ఓ ప్రకటన జారీ చేసింది. కాగా, భారత బలగాలు కూడా వెనక్కి వెళ్లిపోతున్నాయని చైనా తన ప్రకటనలో పేర్కొంది. కమాండర్ల స్థాయి చర్చల తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు చైనా రక్షణ మంత్రిత్వ శాఖ తన ప్రకటనలో వెల్లడించింది. తూర్పు లద్దాఖ్‌లో ఉద్రిక్తతల నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చైనా పేర్కొంది.
గాల్వాన్ లోయలో భారత్-చైనా బలగాల మధ్య ఘర్షణ మొదలు.. ఇప్పటి వరకు సరిహద్దుల వెంట తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న విషయం తెలిసిందే. సరిహద్దుల్లో ఇరు దేశాలకు చెందిన భద్రతా బలగాలు భారీగా మోహరించాయి. దాంతో పరిస్థితి మరింత తీవ్రంగా మారింది. ఏ క్షణంలోనైనా చైనా-భారత్ మధ్య యుద్ధం జరిగిద్దేమో అన్నంత పరిస్థితులు నెలకొన్నాయి. దాంతో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు గాల్వాన్ ఘటన మొదలు ఇప్పటి వరకు ఇరు దేశాల సైనికాధికారులు చర్చలు జరుపుతూ వచ్చారు. తాజాగా కమాండర్ల స్థాయి చర్చల తర్వాత ఇరు దేశాలు తమ సైన్యాన్ని సరిహద్దుల్లోంచి ఉపసంహరించుకోవాలని నిర్ణయించాయి. ఈ క్రమంలోనే చైనా తాజా ప్రకటన విడుదల చేసింది.
Also read:
రైతుల నిరసనలపై 500 ఖాతాలను మూసేసిన ట్విటర్, భారత ప్రభుత్వంతో సహకరిస్తామని హామీ