రైతుల నిరసనలపై 500 ఖాతాలను మూసేసిన ట్విటర్, భారత ప్రభుత్వంతో సహకరిస్తామని హామీ
రైతుల నిరసనలకు సంబంధించిన దాదాపు 500 కు పైగా ఖాతాలను ట్విటర్ బ్లాక్ చేసింది. వందలాది అకౌంట్లు తమ నిబంధనలను అతిక్రమించాయని పేర్కొంది.
రైతుల నిరసనలకు సంబంధించిన దాదాపు 500 కు పైగా ఖాతాలను ట్విటర్ బ్లాక్ చేసింది. వందలాది అకౌంట్లు తమ నిబంధనలను అతిక్రమించాయని పేర్కొంది. ద్వేషాన్ని, హింసను, హానిని రెచ్ఛగొట్టే ఖాతాలపై వేటు వేస్తున్నామని వెల్లడించింది. రైతు చట్టాలకు వ్యతిరేకంగా నిరసన చేస్తున్న అన్నదాతలకు సంబంధించి పోస్టయిన 1400 ఖాతాలను నిలిపివేయాలని భారత ప్రభుత్వం ట్విటర్ ను ఆదేశించిన నేపథ్యంలో ఈ సామాజిక ‘వేదిక’ ఈ చర్య తీసుకుంది. ఆరోగ్యకరమైన వాతావరణాన్ని ప్రమోట్ చేసేందుకు పారదర్శక విధానం మూలమవుతుందని, అందువల్ల తాము తాజాగా ఈ చర్యపై దృష్టి పెట్టామని స్పష్టం చేసింది.
ఇండియాలో ముఖ్యంగా ఢిల్లీలో ఇటీవలి వారాల్లో జరిగిన హింసాత్మక ఘటనల నేపథ్యంలో మా రూల్స్ ని అప్డేట్ చేస్తున్నాం, ప్రపంచ వ్యాప్తంగా మేం ఎలా ఆపరేట్ చేస్తున్నామన్నది ప్రభుత్వాలు గుర్తించాలి అని ట్వీట్ చేసింది. వరల్డ్ వైడ్ గా భావ ప్రకటన స్వేచ్ఛకు ఒక విధంగా ముప్పు ఏర్పడుతోందని, కానీ ఇదే సమయంలో ఇందువల్ల తలెత్తే పరిణామాలను మదింపు చేశామని వెల్లడించింది. ఈ సందర్భంగా గత జనవరి 26 భారత గణ తంత్ర దినోత్సవం రోజున ఢిల్లీ ఎర్రకోట వద్ద జరిగిన హింసాత్మక ఘటనలను గుర్తు చేయడమే గాక.. హానికరమైన కంటెంట్ తో కూడిన హ్యాష్ ట్యాగ్ లను తగ్గించివేస్తున్నట్టు కూడా పేర్కొంది. భారత ప్రభుత్వంతో చర్చలు జరుపుతామని, ప్రభుత్వానికి సహకరిస్తామని హామీ ఇచ్చారు ట్విటర్ నిర్వాహకులు.
Transparency is the foundation for promoting healthy public conversation.
Following the reports of violence in recent weeks, we’re sharing a granular update on our proactive efforts to enforce our rules and defend our principles in India: https://t.co/ry557Nj94U
— Twitter Safety (@TwitterSafety) February 10, 2021
Read More:రైతు చట్టాలపై పార్లమెంట్ లో విపక్షాల రభస, హద్దు మీరుతున్నారని ప్రధాని మోదీ ఆగ్రహం