Migrant workers: మళ్లీ మొదలైన వలస కూలీల కష్టాలు.. ముల్లెమూట సర్దుకుని స్వస్థలాలకు పయనమవుతున్న వలస జీవులు
Migrant workers: దేశంలో కరోనా మహమ్మారి కొరలు చాస్తోంది. రోజురోజుకు పాజిటివ్ కేసులు, మరణాలతో అతలాకుతలం చేస్తోంది. గత ఏడాది కిందట తీవ్ర స్థాయిలో విజృంభించి..
► వలస కూలీల్లో లాక్‌డౌన్ భయం
► కూలీలతో నిండిపోతున్న రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు
►మళ్లీ ధీనస్థితిలో వలస కూలీల బతుకులు
Migrant workers: దేశంలో కరోనా మహమ్మారి కొరలు చాస్తోంది. రోజురోజుకు పాజిటివ్ కేసులు, మరణాలతో అతలాకుతలం చేస్తోంది. గత ఏడాది కిందట తీవ్ర స్థాయిలో విజృంభించి కాస్త తగ్గుముఖం పట్టిందనుకునేలోపే మళ్లీ తీవ్ర స్థాయిలో విజృంభించడం ఆందోళనకు గురి చేస్తోంది. కోవిడ్ కారణంగా దేశంలో వలస కూలీలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. గత ఏడాదిగా కుదిపేసిన కోవిడ్.. ఇప్పుడు రెండో దశ కుదిపేస్తోంది. ఈ క్రమంలో ప్రభుత్వ ఆంక్షలు మరింత భయపెడుతున్నాయి. మళ్లీ దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ విధిస్తారన్న ఆందోళనతో ముందుగానే ముల్లెమూట సర్దుకుని సొంతింటికి పయనమవుతున్నారు వలస కూలీలు.
ఢిల్లీ, ముంబై, రాజస్థాన్ సహా దేశంలోని అనేక ప్రాంతాల్లో ఉన్న వలస కూలీలు రైల్వే స్టేషన్‌లు, బస్టాండ్లలో క్యూలు కడుతున్నారు. ఇప్పటికే ఢిల్లీ జార్ఖండ్‌లలో లాక్‌డౌన్ కొనసాగుతోంది. అనేక రాష్ట్రాల్లో రాత్రి సమయాల్లో కర్ఫ్యూలు సహా అనేక ఆంక్షలు విధిస్తున్నారు. కోవిడ్ ప్రభావాన్ని ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్రమోదీ మంగళవారం జాతినుద్దేశించి ప్రసంగించారు. తప్పనిసరి అనుకుంటేనే రాష్ట్రాలు లాక్‌డౌన్ విధించాలని సూచించారు. ఈ నేపథ్యంలో వలస కూలీల్లో మరింత ఆందోళల నెలకొంది.
గతంలో కంటే ప్రస్తుతం దేశంలో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువ సంఖ్యలో నమోదు అవుతున్నాయి. ఢిల్లీ, యూపీల్లో ఎప్పుడు లేనంతగా భారీ స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. ఒక వైపు కోవిడ్ భయం, మరో వైపు దేశం లాక్‌డౌన్ దిశగా వెళ్తుందేమోనన్న ఆందోళన నెలకొంది వలస కూలీల్లో. దీంతో కూలీలు స్వస్థలాలకు వెళ్లేందుకు మొగ్గు చూపుతున్నారు. గత వారం రోజులుగా దేశ వ్యాప్తంగా వేల మంది వలస కూలీలు సొంతింటికి వెళ్లారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం దేశంలో లక్షల్లో పాజిటివ్ కేసులు, వేల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. ఇప్పటికే దాదాపు అన్ని రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూ, కొన్ని రాష్ర్టాల్లో కోవిడ్ ఎక్కువగా ఉన్న జిల్లాల్లో లాక్‌డౌన్ విధిస్తున్నారు. ఒక వైపు వ్యాక్సినేషన్ కొనసాగుతుండగా, మరో వైపు కరోనా కేసులు పెరుగుతుండటంతో ప్రభుత్వాలకు పెద్ద తలనొప్పిగా మారింది. కరోనా కట్టడికి ఎన్ని చర్యలు చేపట్టినా.. ఏ మాత్రం తగ్గడం లేదు. కరోనా కేసులు పెరగడానికి జనాల తప్పిదం కూడా ఒక కారణమని నిపుణులు చెబుతున్నారు. కొందరు మాస్కులు ధరించకపోవడం, భౌతిక దూరం పాటించకపోవడం వంటి కారణాల వల్ల కూడా వైరస్ వ్యాప్తి మరింత పెరుగుతోందని పేర్కొంటున్నారు.
Long queue of #MigrantWorkers at Mumbai’s Lokmanya Tilak Terminus as they return to their hometowns amid surging #COVID19 cases across the state pic.twitter.com/xDYUTT4dVB
— NDTV (@ndtv) April 20, 2021
ఇవీ చదవండి: Coronavirus: కరోనా హాట్‌స్పాట్‌గా మారిన నాగార్జునసాగర్ నియోజకవర్గం… వరుసగా కోవిడ్ బారిన పడుతున్న నేతలు