Karting SuperSeries: ముగిసిన కొత్త ఫోర్‌ స్ట్రోక్‌ కార్టింగ్‌ సిరీస్‌.. హైదరాబాద్‌ వేదికగా మరో రేసింగ్‌ ఈవెంట్‌

హైదరాబాద్ వేదికగా మరో రేసింగ్ ఈవెంట్ అట్టహాసంగా జరిగింది. కొత్త ఫోర్-స్ట్రోక్ కార్టింగ్ సిరీస్ ఏప్రిల్ 29న చెన్నైలో ప్రారంభమై జూన్ 4న హైదరాబాద్‌లో ముగిసింది.

Karting SuperSeries: ముగిసిన కొత్త ఫోర్‌ స్ట్రోక్‌ కార్టింగ్‌ సిరీస్‌.. హైదరాబాద్‌ వేదికగా మరో రేసింగ్‌ ఈవెంట్‌
Karting Star
Follow us

| Edited By: Shiva Prajapati

Updated on: Jun 04, 2023 | 10:28 PM

దేశంలోని కార్టింగ్ ఔత్సాహికుల కోసం సరికొత్తగా ఆరు రౌండ్లలో జరిగిన రేసింగ్ ఈవెంట్ హైదరాబాద్‌లో ముగిసింది. కొత్త ఫోర్-స్ట్రోక్ కార్టింగ్ సిరీస్ ఏప్రిల్ 29న చెన్నైలో ప్రారంభమై జూన్ 4న హైదరాబాద్‌లో ముగిసినట్టు రేసింగ్‌ ప్రమోషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రకటించింది. హైదరాబాద్‌లోని చికేన్ సర్క్యూట్ ఈ రేసింగ్ ఈవెంట్ ఫైనల్‌కు వేదిక అయింది. హైదరాబాద్‌లో జరిన ఫైనల్‌లో మొత్తం 6 నగరాల నుంచి 36 మంది డ్రైవర్‌లు పోటీ పడ్డారు . ఇంకా ఫార్మాట్‌లో ఒక్కో బ్యాచ్‌కు తొమ్మిది మంది డ్రైవర్లతో ప్రాక్టీస్, క్వాలిఫైయింగ్ సెషన్ నిర్వహించారు.

ఈ ఫైనల్‌కి ముందు నాలుగు క్వాలిఫైయింగ్స్ జరిగాయి. ప్రతి రౌండ్‌లోని టాప్-5 డ్రైవర్లు సెమీ-ఫైనల్‌కు అర్హత సాధించారు. ప్రతి సెమీ-ఫైనల్ హీట్‌లో టాప్-5 డ్రైవర్లు హైదరాబాద్‌లో జరిగిన ఫైనల్‌లో పోటీ పడగా,,రచిత్‌ సింగాల్‌ విజేతగా నిలిచాడు,విజేతగా నిలిచిన రచిత్‌కి జూలైలో ప్రారంభమయ్యే FMSCI నేషనల్ కార్టింగ్ ఛాంపియన్‌షిప్ కోసం 2 కోట్ల విలువైన స్కాలర్‌షిప్‌లను అందజేస్తారు.

ఈ స్కాలర్‌షిప్‌లు ఫ్రీ ఎంట్రీతో పాటు శిక్షణ, కొత్త కార్ట్, మెకానిక్, ఇంజనీర్‌లను కవర్ చేస్తాయి. హైదరాబాద్ మినహా ప్రతి నగరంలో టాప్-3 విజేతలు ట్రోఫీని పొందుతారు. ఇంకా మొత్తం సిరీస్ నుంచి టాప్-6 డ్రైవర్లు FMSCI నేషనల్ కార్టింగ్ ఛాంపియన్‌షిప్ కోసం స్కాలర్‌షిప్‌ను అందుకుంటారు. చైన్నై, బెంగళూర్, కేరళ, ముంబై, ఢిల్లీలో నిర్వహించిన రేస్ లలో టాప్ 6 ఫైనలిస్టులతో గ్రాండ్ ఫినాలే హైదరాబాద్‌లో నిర్వహించినట్లు రేసింగ్ ప్రమోషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ అడ్ మేనేజింగ్ డైరెక్టర్ అఖిల్ రెడ్డి తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు