Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఉత్తరాఖండ్ లో మళ్ళీ విరిగిపడుతున్న కొండచరియలు.. జాతీయ రహదారుల్లో స్తంభించిన రాకపోకలు

ఉత్తరాఖండ్ లో కొండచరియలు మళ్ళీ విరిగి పడుతున్నాయి. అనేక చోట్ల చెట్లు నేలకూలుతున్నాయి. చంపావత్ లోని స్వాలా ప్రాంత సమీపంలో నిన్న కొండచరియలు విరిగిపడుతున్న దృశ్యాల వీడియోలు వైరల్ అవుతున్నాయి.

ఉత్తరాఖండ్ లో మళ్ళీ విరిగిపడుతున్న కొండచరియలు.. జాతీయ రహదారుల్లో స్తంభించిన రాకపోకలు
Land Slide
Follow us
Umakanth Rao

| Edited By: Phani CH

Updated on: Aug 24, 2021 | 9:28 AM

ఉత్తరాఖండ్ లో కొండచరియలు మళ్ళీ విరిగి పడుతున్నాయి. అనేక చోట్ల చెట్లు నేలకూలుతున్నాయి. చంపావత్ లోని స్వాలా ప్రాంత సమీపంలో నిన్న కొండచరియలు విరిగిపడుతున్న దృశ్యాల వీడియోలు వైరల్ అవుతున్నాయి. నిముషం నిడివి గల ఇవి సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ ప్రకృతి వైపరీత్యం ఫలితంగా తనక్ పూర్-చంపావత్ నేషనల్ హైవేపై రాకాపోకలు స్తంభించిపోయాయి. అనేక వాహనాలు వెనక్కి మళ్లుతుండగా కొందరు ఈ దృశ్యాలను తమ సెల్ లో బంధించారు. బండరాళ్లను, శిథిలాలలను తొలగించడానికి మరో రెండు మూడు రోజులు పడుతుందని..పరిస్థితి ప్రమాదకరంగా ఉందని అధికారులు చెబుతున్నారు. ట్రాఫిక్ ని మరో రూట్ లో మళ్లించాలని తాము ఆదేశించినట్టు జిల్లా మేజిస్ట్రేట్ వినీత్ తోమర్ తెలిపారు. నిన్న గాక మొన్న నైనిటాల్ లో కొండపై నుంచి బండరాళ్లు జారిపడడంతో అటు 14 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సుకు తృటిలో ప్రమాదం తప్పింది. రాష్ట్రంలో మరో రెండు మూడు రోజులు భారీ వర్షాలు పడవచ్చునని వాతావరణ శాఖ హెచ్చరించింది.

ఈ రాష్ట్రానికి పొరుగునే ఉన్న హిమాచల్ ప్రదేశ్ లోని కిన్నౌర్ జిల్లాలో ఇటీవల కొండచరియలు విరిగిపడి ఓ బస్సు, భారీ ట్రక్కు, మరికొన్ని వాహనాలు శిథిలాల్లో చిక్కుకుపోగా సుమారు 20 మంది మరణించగా పలువురు గల్లంతయ్యారు. శిథిలాల తొలగింపునకు దాదాపు వారం రోజులు పట్టింది. ఈ రాష్ట్రానికి కూడా వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తరాఖండ్, హిమాచల్ వంటి రాష్ట్రాలకు భూకంప ప్రకంపనల తాకిడి ప్రభావం ఎక్కువగా ఉందని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందువల్లే ఇక్కడ ఎప్పటికప్పుడు భౌగోళిక సర్వేలు జరగాలని వారు సూచిస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: బెడిసికొట్టిన బుల్లెట్‌ సాంగ్‌..! కట్‌ చేస్తే.. ఉద్యోగం ఫట్‌.! వీడియో

రామునిపల్లి గ్రామంలో ఆనాదిగా వస్తున్న వింత ఆచారం.. పాచి ముఖాలతో పూజలు.. వీడియో