Indian Army: 15వేల అడుగల ఎత్తైన హిమగిరుల్లో రెపరెపలాడిన జాతీయ జెండా.. వీడియో షేర్ చేసిన ఇండియన్ ఆర్మీ..

Indian Army: భారతదేశం-చైనా మధ్య కొనసాగుతున్న సరిహద్దు వివాదం మధ్య, భారత సైన్యం ఆదివారం లడఖ్ లో 15,000 అడుగుల ఎత్తులో 76 అడుగుల పొడవైన జాతీయ జెండాను ఎగురవేసింది.

Indian Army: 15వేల అడుగల ఎత్తైన హిమగిరుల్లో రెపరెపలాడిన జాతీయ జెండా.. వీడియో షేర్ చేసిన ఇండియన్ ఆర్మీ..
Indian Flag
Follow us

|

Updated on: Nov 22, 2021 | 6:56 AM

Indian Army: భారతదేశం-చైనా మధ్య కొనసాగుతున్న సరిహద్దు వివాదం మధ్య, భారత సైన్యం ఆదివారం లడఖ్ లో 15,000 అడుగుల ఎత్తులో 76 అడుగుల పొడవైన జాతీయ జెండాను ఎగురవేసింది. ఈ జెండాను హాన్లే లోయలో ఎగురవేశారు. ఇండియన్ ఆర్మీ ఫైర్ అండ్ ఫ్యూరీ కార్ప్స్ ఈ జెండాను ఎగురవేసింది. దానికి సంబంధించిన వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేసింది. కాగా, ఈ జెండాను ఇండియన్ ఆర్మీ, ఫ్లాగ్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా తయారు చేసింది.

ఆజాదీకా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా ఈ జెండాను ఎగురవేసినట్లు భారత సైన్యం ప్రకటించింది. ఆర్మీ షేర్ చేసిన ఈ వీడియోలో.. జాతీయ గీతం ప్లే అవుతుండగా రెండు బృందాల సైనికులు జెండాకు వందనం చేస్తూ కనిపించారు.

ప్రపంచంలోనే అతిపెద్ద ఖాదీ జాతీయ జెండా.. ఇదిలాఉంటే.. భారత సైన్యం చర్య శత్రువులకు బలమైన సందేశంగా కూడా పరిగణించబడుతుంది. అంతకుముందు అక్టోబర్ 2న లేహ్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద ఖాదీ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ జెండా 225 అడుగుల పొడవు మరియు 150 అడుగుల వెడల్పు ఉంది. శ్రీనగర్‌లోని డిఫెన్స్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ కల్నల్ ఇమ్రాన్ మౌసావి, లేహ్ గ్యారీసన్‌లో ఫైర్ అండ్ ఫ్యూరీ కార్ప్స్ ఆ చారిత్రాత్మక కార్యక్రమాన్ని నిర్వహించారు. లేహ్‌లోని ఎత్తైన పర్వతంపై లెఫ్టినెంట్ గవర్నర్ ఆర్‌కె మాథుర్ భారీ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవాణే, నార్తర్న్ కమాండ్ లెఫ్టినెంట్ జనరల్ వైకే జోషి కూడా హాజరయ్యారు.

భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన 75 సంవత్సరాల జ్ఞాపకార్థం భారత సైన్యం గత కొన్ని నెలలుగా లడఖ్‌లో అనేక కార్యక్రమాలను నిర్వహించింది. నవంబర్ 7, 1947న జరిగిన షాల్టెంగ్ యుద్ధంలో కాశ్మీరీలు, భారత సైనికులు చేసిన త్యాగాలను గుర్తుచేసుకుంటూ ఈ నెల ప్రారంభంలో, భారత సైన్యం చినార్ కార్ప్స్ చారిత్రాత్మక ‘శాల్టెంగ్ యుద్ధం’ని స్మరించుకుంటూ లైట్ అండ్ సౌండ్ షోను నిర్వహించింది.

Also read:

Viral Video: ఫోన్‌ వాడటం మొదలెడితే.. మాకన్న ఎవరూ వాడలేరంటున్న కోతులు.. ఫన్నీ వీడియో

Beware: ఫ్రీజ్‌లో ఆ 8 ఆహార పదార్థాలను ఎప్పుడూ ఉంచవద్దు.. ఎందుకో తెలిస్తే షాకే..

AP Rains: ప్రయాణికులకు అలెర్ట్‌.. భారీ వర్షాల కారణంగా 18 రైళ్లు రద్దు.. పలు సర్వీసులు దారి మళ్లింపు..

Latest Articles