Joint Bank Account: పెన్షన్ కోసం ఉమ్మడి ఖాతా తెరవడం తప్పనిసరి కాదు.. స్పష్టం చేసిన కేంద్రం..
జీవిత భాగస్వామి పెన్షన్ పొందేందుకు ఉమ్మడి బ్యాంకు ఖాతా తెరవడం తప్పనిసరి కాదని కేంద్రం ప్రభుత్వం పునరుద్ఘాటించింది. పెన్షన్ శాఖ సీనియర్ అధికారులతో సమావేశం అనంతరం సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల శాఖ మంత్రి జితేంద్ర సింగ్ ఈ విషయాన్ని స్పష్టం చేశారు...
జీవిత భాగస్వామి పెన్షన్ పొందేందుకు ఉమ్మడి బ్యాంకు ఖాతా తెరవడం తప్పనిసరి కాదని కేంద్రం ప్రభుత్వం పునరుద్ఘాటించింది. పెన్షన్ శాఖ సీనియర్ అధికారులతో సమావేశం అనంతరం సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల శాఖ మంత్రి జితేంద్ర సింగ్ ఈ విషయాన్ని స్పష్టం చేశారు. పదవీ విరమణ పొందుతున్న ప్రభుత్వోద్యోగి తన జీవిత భాగస్వామితో ఉమ్మడి ఖాతాను తెరవడం సాధ్యం కాదని కార్యాలయ అధిపతి సంతృప్తి చెందితే ఈ నిబంధన సడలించవచ్చని ఆయన అన్నారు. కుటుంబ పెన్షన్ క్రెడిట్ కోసం జీవిత భాగస్వామి (కుటుంబ పెన్షనర్) ప్రస్తుత జాయింట్ బ్యాంక్ ఖాతాను ఎంచుకుంటే, కొత్త ఖాతా తెరవాలని బ్యాంకులు పట్టుబట్టవద్దని కేంద్ర ప్రభుత్వ పెన్షన్‌ను పంపిణీ చేసే అన్ని బ్యాంకులకు సూచించినట్లు మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది.
జీవిత భాగస్వామితో జాయింట్ బ్యాంక్ ఖాతా అయితే కావాల్సినది పెన్షన్ పేమెంట్ ఆర్డర్ (PPO)లో కుటుంబ పెన్షన్ కోసం అధికారం ఉన్న వారి జీవిత భాగస్వామితో దీన్ని తెరవాలి. ఈ ఖాతాలలో ఆపరేషన్ పెన్షనర్ కోరుకున్న ప్రాతిపదికన ఉంటుందని మంత్రి చెప్పారు. జాయింట్ బ్యాంక్ ఖాతాను తెరవడం వెనుక ప్రధాన కారణం కుటుంబ పింఛను ఎటువంటి ఆలస్యం లేకుండా అందించమని తెలిపింది. కొత్త పెన్షన్ బ్యాంక్ ఖాతాను తెరవడానికి కుటుంబ పింఛనుదారు ఎటువంటి కష్టాలను ఎదుర్కోకుండా చూసుకోవడమేనని తమ ఉద్దేశమని ప్రకటనలో పేర్కొంది. కుటుంబ పింఛను ప్రారంభించడానికి దరఖాస్తు సమర్పించేటప్పుడు కుటుంబ పెన్షనర్‌కు కనీస పత్రాలు ఉండాలని చెప్పింది.
Read Also.. Gold Price Today: బంగారం ధరలు.. కొన్ని నగరాల్లో తగ్గితే.. మరి కొన్ని నగరాల్లో పెరిగింది..!