Gold Price Today: బంగారం ధరలు.. కొన్ని నగరాల్లో తగ్గితే.. మరి కొన్ని నగరాల్లో పెరిగింది..!

Gold Price Today: మహిళలు బంగారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుంటారు. దేశంలో బంగారం ఎంత పెరిగినా.. కొనుగోళ్లు మాత్రం జరుగుతూనే ఉంటాయి. దేశీయంగా సోమవారం..

Gold Price Today: బంగారం ధరలు.. కొన్ని నగరాల్లో తగ్గితే.. మరి కొన్ని నగరాల్లో పెరిగింది..!
Follow us

|

Updated on: Nov 22, 2021 | 6:11 AM

Gold Price Today: మహిళలు బంగారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుంటారు. దేశంలో బంగారం ఎంత పెరిగినా.. కొనుగోళ్లు మాత్రం జరుగుతూనే ఉంటాయి. దేశీయంగా సోమవారం (నవంబర్‌ 22) బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. అయితే కొన్ని నగరాల్లో స్వల్పంగా తగ్గాయి కూడా. మున్ముందు పెళ్లిళ్ల సీజన్‌ ఉండటంతో మరింత పెరిగే అవకాశం ఉందని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. తాజాగా నమోదైన ధరల వివరాలు ఇలా ఉన్నాయి.

ప్రధాన నగరాల్లో ధరలు.. ► దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,890 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,240గా ఉంది.

► ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,280 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,280గా ఉంది.

► చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,210 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,280 ఉంది.

► కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,290 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,990 ఉంది.

► బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,740 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,900 ఉంది.

► కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,740 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,900గా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో ధరలు.. ► హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,740 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,000గా ఉంది.

►విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,740 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,900గా ఉంది.

► విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,740 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.49,900గా ఉంది.

బంగారం ధరల్లో మార్పులు చోటు చేసుకోవడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు పేర్కొంటున్నారు. అయితే ఈ ధరలు బులియన్‌ మార్కెట్‌ వెబ్‌సైట్ల ఆధారంగా ఇవ్వబడుతున్నాయి. ఎందుకంటే ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. బంగారం కొనుగోలు చేసే ముందు ఒక్కసారి ధరలను పరిశీలించి వెళ్లడం మంచిది.

ఇవి కూడా చదవండి:

Garments: బట్టలు కొనుగోలు చేసేవారికి షాకింగ్‌.. ఇక వీటి ధరలు కూడా పెరగనున్నాయ్‌.. ఎందుకంటే..!

an Dhan Accounts: ఖాతాదారులకు ఎస్‌బీఐ షాక్‌.. పొరపాటున వసూలు చేసిన రూ.254 కోట్లు.. బ్యాంకుపై ఫిర్యాదు..!