యోగీ ఇలాకాలో దారుణ ఘటన.. కులాంతర వివాహం చేసుకున్న అమ్మాయికి విచిత్ర శిక్ష..!

మరో ఆటవిక సాంప్రదాయానికి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచింది యోగీ సర్కార్. కఠినమైన చట్టాలు తీసుకొచ్చామని.. చట్టాన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎన్ని హెచ్చరికలు జారీ చేసిన.. వీ డోంట్ కేర్ అంటున్నారు యూపీ వాసులు. రాష్ట్రంలోని ఝాన్సీ జిల్లాలో జరిగిన దారుణ ఘటన చూస్తే.. సభ్య సమాజం తలదించుకోవాల్సిందే. వివరాల్లోకి వెళితే.. ఝాన్సీ పట్టణానికి చెందిన ఓ యువకుడు.. ఇతర కులానికి చెందిన ఓ యువతితో ప్రేమలోపడ్డాడు. అనంతరం ఇరువురు ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే […]

యోగీ ఇలాకాలో దారుణ ఘటన.. కులాంతర వివాహం చేసుకున్న అమ్మాయికి విచిత్ర శిక్ష..!
Follow us

| Edited By:

Updated on: Feb 09, 2020 | 7:22 PM

మరో ఆటవిక సాంప్రదాయానికి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచింది యోగీ సర్కార్. కఠినమైన చట్టాలు తీసుకొచ్చామని.. చట్టాన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎన్ని హెచ్చరికలు జారీ చేసిన.. వీ డోంట్ కేర్ అంటున్నారు యూపీ వాసులు. రాష్ట్రంలోని ఝాన్సీ జిల్లాలో జరిగిన దారుణ ఘటన చూస్తే.. సభ్య సమాజం తలదించుకోవాల్సిందే. వివరాల్లోకి వెళితే.. ఝాన్సీ పట్టణానికి చెందిన ఓ యువకుడు.. ఇతర కులానికి చెందిన ఓ యువతితో ప్రేమలోపడ్డాడు. అనంతరం ఇరువురు ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే విషయం తెలుసుకున్న గ్రామస్థులు.. ఆ జంటను గ్రామ బహిష్కరణ చేయాలని నిర్ణయించారు.

ఇదే సమయంలో సదరు యువకుడి తండ్రి.. గ్రామపెద్దలను బతిమాలాడు. తన కుమారుడిని గ్రామ బహిష్కరణ చేయోద్దంటూ వేడుకోవడంతో.. ఓ విచిత్రమైన శిక్ష విధించారు. ఇతర కులానికి చెందిన అమ్మాయిని వివాహం చేసుకున్నందున్న.. ఆ అమ్మాయిను తమ కులంలో కలుపుకోవాలని ఆదేశించారు. అందుకు ఆమె గోమూత్రం తాగి, ఆవు పేడ తినాలని తీర్మానించారు. పైగా పంచాయితీకి రూ. 5 లక్షల జరిమానా కట్టాలంటూ హుకూం జారీ చేశారు. అందుకు రెండు నెలల సమయం కూడా ఇచ్చారు. అయితే గ్రామ పెద్దలు ఇచ్చిన తీర్పును ఆ యువకుడు ఖండించాడు. తీర్పును వ్యతిరేకిస్తూ.. పోలీసులను ఆశ్రయించాడు. దీంతో పోలీసులు సదరు గ్రామ పంచాయితీ పెద్దలపై కేసు నమోదు చేశారు. ముందస్తు జాగ్రత్తగా ఆ ప్రేమ జంటకు భద్రతను కల్పించారు.