ఘోర ప్రమాదం.. నిశ్చితార్ధ వేడుకకు వెళ్తూ.. 9 మంది మృతి..!
ఒడిశాలో ఘోరప్రమాదం చోటుచేసుకుంది. ఓ బస్సుకు విద్యుత్ తీగలు తగిలి తొమ్మిది మంది మృతి చెందారు. మరో 22మంది తీవ్రంగా గాయపడగా.. వారిలో తొమ్మిది మంది పరిస్థితి విషమంగా ఉంది. గంజాం జిల్లాలో ఈ ప్రమాదం జరిగింది. వివరాల్లోకి వెళ్తే గొలంత్ర పరిధిలోని మంద్‌రాజ్‌పూర్ మార్గంలో బస్సుకు 11కె.వి విద్యుత్ లైన్ తగిలింది. దీంతో విద్యుత్‌ఘాతం రావడంతో ఘటనాస్థలంలో ఆరుగురు మృతి చెందారు. మరో ముగ్గురు చికిత్స పొందుతూ చనిపోయారు. వివాహ నిశ్చితార్ధానికి వెళ్తుండగా.. ఈ ఘోరం […]
ఒడిశాలో ఘోరప్రమాదం చోటుచేసుకుంది. ఓ బస్సుకు విద్యుత్ తీగలు తగిలి తొమ్మిది మంది మృతి చెందారు. మరో 22మంది తీవ్రంగా గాయపడగా.. వారిలో తొమ్మిది మంది పరిస్థితి విషమంగా ఉంది. గంజాం జిల్లాలో ఈ ప్రమాదం జరిగింది.
వివరాల్లోకి వెళ్తే గొలంత్ర పరిధిలోని మంద్‌రాజ్‌పూర్ మార్గంలో బస్సుకు 11కె.వి విద్యుత్ లైన్ తగిలింది. దీంతో విద్యుత్‌ఘాతం రావడంతో ఘటనాస్థలంలో ఆరుగురు మృతి చెందారు. మరో ముగ్గురు చికిత్స పొందుతూ చనిపోయారు. వివాహ నిశ్చితార్ధానికి వెళ్తుండగా.. ఈ ఘోరం జరిగినట్లు తెలుస్తోంది. ఇక ఈ ప్రమాదం ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు ఉచిత వైద్యసేవలు అందించాలని ఆదేశించిన నవీన్ పట్నాయక్.. మృతుల కుటుంబాలకు 2లక్షల ఎక్స్‌గ్రేషియాను ప్రకటించారు.