AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kerala: కేరళలో మళ్లీ విజృంభణ.. కర్నాటకలో కంగారు, మహమ్మారి వ్యాప్తి అక్కడి నుంచే ఎక్కువట.!

రోనా వైరస్‌ అన్ని రాష్ట్రాల్లో అదుపులోనే ఉన్నట్లు కనిపిస్తున్నప్పటికీ కేరళలో మాత్రం విజృంభిస్తోంది. దేశంలో నమోదవుతున్న 70 శాతం

Kerala: కేరళలో మళ్లీ విజృంభణ.. కర్నాటకలో కంగారు, మహమ్మారి వ్యాప్తి అక్కడి నుంచే ఎక్కువట.!
Kerala
Venkata Narayana
|

Updated on: Sep 02, 2021 | 8:55 AM

Share

Kerala Covid-19: కరోనా వైరస్‌ అన్ని రాష్ట్రాల్లో అదుపులోనే ఉన్నట్లు కనిపిస్తున్నప్పటికీ కేరళలో మాత్రం విజృంభిస్తోంది. దేశంలో నమోదవుతున్న 70 శాతం కేసులు ఇక్కడి నుంచే వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పినరయి ప్రభుత్వానికి కేంద్రం పలు సూచనలు చేసింది. ‘వ్యూహాత్మక లాక్‌డౌన్‌’ అవసరమని కేంద్ర హోంశాఖ వెల్లడించింది. ఇళ్లల్లో చికిత్స పొందుతున్నవారు కొవిడ్‌ నిబంధనలు పాటించడం లేదని.. వారిపై దృష్టి వహించాలంది కేంద్రం. కరోనా కేసులు తగ్గకపోవడానికి ఇదే మెయిన్‌ రీజన్‌ అని వైద్యారోగ్యశాఖ అధికారులంటున్నారు.

మైక్రో కంటైన్‌మెంట్‌ జోన్లను ఏర్పాటు చేయాలని, కఠిన నిబంధనలు అమల్లోకి తీసుకురావాలని కేంద్ర ఆరోగ్య శాఖ కేరళ ప్రభుత్వానికి సూచించింది. కేరళలో కొవిడ్ వ్యాప్తి ఇళ్లలోనే ఎక్కువగా ఉంటున్నట్లు అధికారులే తేల్చారు. 35శాతం కేసులు ఇళ్లలోని కుటుంబసభ్యులకు సంక్రమిస్తున్నాయి. ప్రజలు కొవిడ్ నిబంధనలను నిర్లక్ష్యం చేయడం, వైరస్‌ ముప్పు ఉన్నవారి సంఖ్య ఎక్కువగా ఉండడం వంటివి కరోనా విజృంభణకు అసలు కారణాలుగా తెలుస్తోంది. ప్రభుత్వం కొవిడ్‌ కట్టడి చర్యలు తీసుకుంటున్నా .. వ్యాక్సినేషన్‌ జరుగుతున్నా కేరళలో వైరస్‌ ఉద్ధృతి మాత్రం ఆగనిది ఇందుకేనని సమచారం.

దీంతో మళ్లీ నైట్‌ కర్ఫ్యూ విధించాలని కేరళ రాష్ట్ర సర్కారు నిర్ణయించింది. ఆగస్టు 30 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రాత్రి 10గంటల నుంచి ఉదయం 6గంటల వరకు కర్ఫ్యూ విధించి కొనసాగిస్తోంది. కేరళ నుంచి తమ రాష్ట్రానికి వచ్చేవారు వారంరోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాలని కర్ణాటక ప్రభుత్వం ఈ మధ్యే నిర్ణయించింది. అయితే కేరళను వారంపాటు లాక్‌డౌన్‌ చేస్తే తప్ప కరోనా అదుపులోకి రాదని నిపుణులు అంటున్నారు. పూర్తి లాక్‌ చేస్తే రాష్ట్ర పరిస్థితితులు మరింత దిగజారతాయంటున్నారు అధికారులు.

Read also: Himachal Pradesh: హిమాచల్‌ ప్రదేశ్‌ రూటే సెపరేటు.. దేశానికే ఆదర్శంగా నిలిచిన సమర్థత