Himachal Pradesh: హిమాచల్‌ ప్రదేశ్‌ రూటే సెపరేటు.. దేశానికే ఆదర్శంగా నిలిచిన సమర్థత

భారత దేశంలో కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ రోజు రోజుకు రికార్డులు తిరగరాస్తోంది. మొన్న ఒక్కరోజే కోటీ 30 లక్షల మందికి వ్యాక్సినేషన్‌

Himachal Pradesh: హిమాచల్‌ ప్రదేశ్‌ రూటే సెపరేటు.. దేశానికే ఆదర్శంగా నిలిచిన సమర్థత
Hp
Follow us
Venkata Narayana

|

Updated on: Sep 02, 2021 | 8:26 AM

Himachal Pradesh – Covid vaccination: భారత దేశంలో కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ రోజు రోజుకు రికార్డులు తిరగరాస్తోంది. మొన్న ఒక్కరోజే కోటీ 30 లక్షల మందికి వ్యాక్సినేషన్‌ జరిగింది. ఇది వరల్డ్‌ వైడ్‌గా ఏ దేశానికైనా రికార్డే. ఇదెలా సాధ్యమైంది? మన దేశంలో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ మిగిలిన బడా కంట్రీస్‌ కన్నా తక్కువే. కానీ.. ప్రాపర్‌ ప్లానింగ్‌.. అండ్‌ ఎగ్జిక్యూషన్‌తో ఇది సాధ్యపడుతోంది. అధికారుల చక్కని ప్రణాళిక.. దానికి సంబంధించిన కార్యాచరణతోనే ఇంత భారీ వ్యాక్సినేషన్‌ జరుగుతోంది.

ఇందుకు పెద్ద ఉదాహరణ హిమాచల్‌ ప్రదేశ్‌ వైద్యారోగ్య శాఖ అధికారుల పనితీరే. కంగ్రా జిల్లాలోని బడా భంగల్‌ వంటి మారుమూల గ్రామానికి సైతం వెళ్లి వ్యాక్సిన్‌ అందించారు. సముద్ర మట్టానికి 14వేల అడుగుల ఎత్తులో ఉన్న బడా భంగల్‌ గ్రామానికి హెలీకాఫ్టర్‌ సాయంతో వెళ్లి వ్యాక్సిన్‌ చేశారు. హిమాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రంలో తొలి డోసు టీకా వందశాతం పూర్తైనట్లు ఆ రాష్ట్ర సీఎం జైరామ్‌ ఠాకూర్‌ ప్రకటించారు. 18ఏళ్లు పైబడిన వారందరికీ తొలి డోసు వ్యాక్సిన్‌ ఇచ్చామన్నారు. మారుమూల గ్రామాలకు హెలీకాఫ్టర్లలో సైతం వెళ్లి వ్యాక్సిన్‌ వేశామన్నారు సీఎం. సెకండ్‌ డోస్‌ వ్యాక్సినేషన్‌ కూడా త్వరలోనే పూర్తిచేసి.. ఫుల్లీ వ్యాక్సినేటెడ్‌ స్టేట్‌గా నిలుస్తామంటున్నారు.

ఇలా ఉండగా, ఏపీలో కరోనా తీవ్రత రోజు రోజుకు పెరుగుతోంది. పాజిటివ్ కేసుల సంఖ్యతోపాటు మృతుల సంఖ్య కూడా పెరిగింది.  కరోనా సంబంధించిన అధికారిక సమాచారం కోసం వాట్సాప్ చాట్ బాట్ నంబర్ (8297-104-104) కు Hi, Hello, Covid అని మెసేజ్ చేసి తెలుసుకోవచ్చు. స్మార్ట్ ఫోన్ లేని వారు (8297-104-104) కు ఫోన్ చేసి IVRS ద్వా రా కరోనాకు చెందిన సమాచారం, సహాయం పొందవచ్చు. 104 టోల్ ఫ్రీ కు ఫోన్ చేసి కరోనా సంబంధించిన వైద్య సమస్యలు తెలుపవచ్చు.

Read also: Anantapur: రెచ్చిపోయిన అనంతపురం హోటల్ ఎస్ఆర్ గ్రాండ్‌ హోటల్ సిబ్బంది.. ఫోటోగ్రాఫర్ మీద దాడి : వాచ్ వీడియో