Orang national park: రాజీవ్‌గాంధీ పేరు మార్చేసిన రాష్ట్ర సర్కార్.. ఇకపై ఒరాంగ్‌ నేషనల్‌ పార్కుగా నామకరణం

Balaraju Goud

Balaraju Goud |

Updated on: Sep 02, 2021 | 8:15 AM

ఒరాంగ్ నేషనల్ పార్క్ పేరులో నుండి మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ పేరును తొలగించాలని అసోం మంత్రివర్గం బుధవారం నిర్ణయించింది. రాజీవ్‌గాంధీ ఒరాంగ్‌ నేషనల్‌ పార్క్‌ పేరును ఆ రాష్ట్ర ప్రభుత్వం మార్చింది.

Orang national park: రాజీవ్‌గాంధీ పేరు మార్చేసిన రాష్ట్ర సర్కార్.. ఇకపై ఒరాంగ్‌ నేషనల్‌ పార్కుగా నామకరణం
Orang National Park

Follow us on

Orang national park in Assam: ఒరాంగ్ నేషనల్ పార్క్ పేరులో నుండి మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ పేరును తొలగించాలని అసోం మంత్రివర్గం బుధవారం నిర్ణయించింది. రాజీవ్‌గాంధీ ఒరాంగ్‌ నేషనల్‌ పార్క్‌ పేరును ఆ రాష్ట్ర ప్రభుత్వం మార్చింది. పేరులోంచి రాజీవ్‌గాంధీ పేరును తొలగించి ఒరాంగ్‌ నేషనల్‌ పార్కుగా మార్చాలని అసోం కేబినెట్‌ తీర్మానించింది. దేశంలో క్రీడాకారులకు అందించే రాజీవ్‌ ఖేల్‌రత్న అవార్డు పేరు మారుస్తూ ఇటీవల కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ అవార్డు పేరును మేజర్ ధ్యాన్‌చంద్‌ ఖేల్‌రత్నగా మార్చిన విషయం తెలిసిందే.

రాజీవ్‌ గాంధీ నేషనల్‌ పార్క్‌ దేశంలోనే రాయల్‌ బెంగాల్‌ టైగర్స్‌కు పెట్టింది పేరు. జాతీయ పార్క్‌ పేరును మార్చాలని పెద్ద ఎత్తున విజ్ఞప్తులు వచ్చాయని.. ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ఆదివాసీ, టీ తెగ కమ్యూనిటీ డిమాండ్‌ను పరిగణలోకి తీసుకున్న తర్వాతే కేబినెట్‌ రాజీవ్‌ గాంధీ నేషనల్‌ పార్క్‌ పేరును ఒరాంగ్‌ నేషనల్‌ పార్క్‌గా మార్చాలని నిర్ణయించినట్లు ప్రభుత్వం ప్రకటనలో తెలిపింది. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మతో ఇటీవల ఆదివాసీ మరియు టీ-తెగ కమ్యూనిటీకి చెందిన ప్రముఖుల మధ్య జరిగిన పరస్పర చర్చల్లో భాగంగా ప్రధానంగా పేరు మార్పు ప్రస్థావనకు వచ్చింది. దీంతో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ పేరును ఒరాంగ్ నేషనల్ పార్క్ నుండి తొలగించాలని డిమాండ్ చేసారు. అందుకే పేరు మార్చాల్సి వచ్చిందని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి పిజుష్ హజారికా అన్నారు.

దరాంగ్, ఉదల్‌గురి, సోనిత్‌పూర్ జిల్లాల్లో బ్రహ్మపుత్ర నది ఉత్తర ఒడ్డున ఉన్న జాతీయ ఉద్యానవనం ఇండియన్ రినోస్, రాయల్ బెంగాల్ టైగర్, పిగ్మీ హాగ్, అడవి ఏనుగులు, అడవి నీటి దున్నలకు ప్రసిద్ధి చెందింది. 79.28 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న పార్క్‌ను 1985లో వన్యప్రాణుల అభయారణ్యంగా ప్రకటించారు. 1999లో జాతీయ ఉద్యానవనంగా అప్‌గ్రేడ్‌ చేశారు. 1992లో అభయారణ్యానికి రాజీవ్‌ గాంధీ పేరు పెట్టగా.. తరుణ్ గొగోయ్ నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం 2001లో రాజీవ్ గాంధీ జాతీయ ఉద్యానవనంగా మార్చింది. ఆగస్టు 2005 లో తరుణ్ గొగోయ్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం స్థానికుల నుండి వ్యతిరేకత ఉన్నప్పటికీ దివంగత ప్రధానమంత్రి పేరు మీద ఒరాంగ్ నేషనల్ పార్క్ పేరు మార్చాలని నిర్ణయించింది.

జార్ఖండ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్‌తో పాటు ఛత్తీస్‌గఢ్‌లో నివసించే ఒరాన్ ప్రజల పేరు మీద ఈ జాతీయ ఉద్యానవనానికి పేరు పెట్టారు. అస్సాంలోని టీ-గార్డెన్స్‌లో పని చేయడానికి బ్రిటీష్ వారు తీసుకువచ్చిన ఆ రాష్ట్రాల నుండి వచ్చిన అనేక తెగలలో వేలాది మంది ఉన్నారు. ఒరాన్ తెగకు చెందిన చాలా మంది ప్రజలు ఇప్పుడు పార్క్ ఉన్న ప్రాంతానికి సమీపంలో స్థిరపడ్డారు. కాగా, అసోంలో 73,437 ఒరాన్ ప్రజలు ఉన్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి.

Read Also… YSR: వైఎస్‌ విజయమ్మ నేతృత్వంలో ఇవాళ హైదరాబాద్‌లో YSR సంస్మరణ సభ.. టాలీవుడ్ హీరోలు సహా నేతల హాజరుపై సస్పెన్స్

News Watch : కృష్ణ కృష్ణా.. ఇదో డైలీ సీరియల్.. మరిన్ని వార్తా కధనాల సమాహారం కొరకు వీక్షించండి న్యూస్ వాచ్… ( వీడియో )

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu