AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

KYC : కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇకపై కేవైసీ ఇంట్లోనే చేసుకోవచ్చు.. అదెలాగంటే..

KYC : ఈ ఆన్‌లైన్ యుగంలో, ఇంట్లో కూర్చొనే అన్ని చక్కపెట్టుకునే పరిస్థితులు ఉన్నాయి. అరచేతిలో ఇమిడే ఫోన్‌తోనే సమస్త పనులు జరిగిపోతున్నాయి.

KYC : కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇకపై కేవైసీ ఇంట్లోనే చేసుకోవచ్చు.. అదెలాగంటే..
Sim Card
Shiva Prajapati
|

Updated on: Sep 02, 2021 | 7:36 AM

Share

KYC : ఈ ఆన్‌లైన్ యుగంలో, ఇంట్లో కూర్చొనే అన్ని చక్కపెట్టుకునే పరిస్థితులు ఉన్నాయి. అరచేతిలో ఇమిడే ఫోన్‌తోనే సమస్త పనులు జరిగిపోతున్నాయి. ముఖ్యంగా బ్యాంకింగ్ వ్యవస్థలో ఖాతా తెరవడం నుండి డబ్బు బదిలీ చేయడం వరకు, ఇంటి బిల్లులు, ప్రభుత్వ పత్రాల కోసం దరఖాస్తు చేసుకోవడం, ప్రభుత్వ పత్రాల్లో మార్పులు చేయడం అన్నీ ఇంటి నుంచే చక్కబెడుతున్నారు. కాగా, కేంద్ర ప్రభుత్వం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. సాధారణంగా సిమ్ కొనుగోలు చేయాలనుకునే వారు.. సిమ్ ప్రొవైడర్ స్టోర్‌కి వెళ్లి కేవైసీ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. కానీ, తాజాగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఆ పనిని ఇంట్లో కూడా చేసుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం..

కొత్త అప్‌డేట్ ఏంటి?.. ఈ కొత్త విధానంలో సిమ్‌ కోసం స్టోర్‌కు వెళ్లాల్సిన పని లేదు. సిమ్ ఇంటికే డెలివరీ చేయడం జరుగుతుంది. సిమ్ కేవైసీని సెల్ఫ్‌గా చేసుకోవచ్చు. దీనికి సంబంధించే కేంద్ర టెలీకమ్యూనికేషన్ శాఖ సెల్ఫ్ కేవైసీ కోసం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ప్రైవేట్, అవుట్ స్టేషన్ కేటగిరీ వినియోగదారుల కొత్త కనెక్షన్లకు సంబంధించి ఈ నియమాలను ప్రభుత్వం జారీ చేసింది.

సెల్ఫ్ కేవైసీ ఏంటి? సాధారణంగా కేవైసీ అప్‌డేట్ చేసుకోవాలంటే.. సదరు సంస్థ కార్యాలయానికి వెళ్లాల్సిందే. సంబంధిత ధృవపత్రాలను తీసుకుని ఆయా కార్యాలయానికి వెళ్లి కేవైసీ ధృవీకరించుకోవాల్సి ఉంటుంది. అయితే, తాజా విధానంతో వినియోగదారులు ఎక్కడికీ వెళ్లా్ల్సిన పని లేదు. ఇంట్లో కూర్చొనే కేవైసీని పూర్తి చేయొచ్చు. దీనిని వెబ్‌సైట్, అప్లికేషన్ ద్వారా పూర్తి చేయొచ్చు.

సిమ్ కోసం సెల్ఫ్ కేవైసీ ఎలా చేయాలి? టెలీ కమ్యూనికేషన్ మంత్రిత్వ శాఖ ఇచ్చిన సమాచారం ప్రకారం.. సంబంధిత సిమ్ ప్రొవైడర్ అప్లికేషన్‌ను ఫోన్‌లో డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఆ తరువాత, మీరు మీ ఫోన్‌తో రిజిస్టర్ చేసుకోవాలి. ఇందుకోసం ప్రత్యామ్నాయ ఫోన్ నంబర్ ఇవ్వాలి. దీని తరువాత మీరు ఎంటర్ చేసిన ప్రత్యామ్నాయ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. అయితే, ప్రత్యామ్నాయ ఫోన్ నెంబర్ ఇండియాది మాత్రమే ఉండాలి. అలా లాగిన్ అయిన తరువాత.. యాప్‌లో సెల్ఫ్ కేవైసీ అనే ఆప్షన్ ఉంటుంది. దానిలో అడిగిన వివరాలను నమోదు చేయడం ద్వారా కేవైసీ కంప్లీట్ అవుతుంది.

Also read:

India Rains: భారీ వర్షాలతో రాజధాని సహా ఉత్తర భారతం భీతావహం.. అసోంలో 7 లక్షల మంది నిరాశ్రయులు

Bigg Boss 5 Telugu: బిగ్‏బాస్ వాయిదా పడుతోందా ?.. నెట్టింట్లో టాక్.. ఆ పోస్టర్‏తో రూమర్లకు చెక్..

Avinash Marriage: మా మధ్య ఏదో ఉందని పుకార్లు ఉన్నాయి.. అవినాష్‌ వివాహంపై స్పందించిన అరియానా.