ఎస్ఎస్ఎల్సీ పరీక్షలలో ఫెయిల్ అయిన విద్యార్థులకు ఒత్తిడిని దూరం చేసేందుకు కొడైకెనాల్లోని హోం స్టే ఓనర్ వారికి ఫ్రీ వసతి కల్పిస్తున్నారు. చెట్టియార్ పార్కు సమీపంలోని హెం స్టే కలిగిన కే. సుధీష్ బుధవారం తన ఫేస్బుక్ ఖాతా ద్వారా ఈ ఆఫర్‌ను ప్రకటించారు. ” ఓడిపోయినవారు సృష్టించిన ప్రపంచం ఎల్లప్పుడూ విజేతలకు ఉత్సాహాన్ని ఇస్తుంది” అంటూ ట్వీట్ చేశాడు సుధీష్. ప్రస్తుతం సుధీష్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
కేరళలోని కోజికోడ్‌కు చెందిన సుధీష్ హోటల్ మేనేజ్మెంట్ పూర్తి చేసి 2003లో కొడైకెనాల్లో తన సంస్థను ప్రారంభించారు. తన స్నేహితులతో కలిసి పట్టణానికి దూరంగా ఒక హిల్ స్టేషన్ ఏర్పాటు చేశారు. ప్రస్తుత విద్యా వ్యవస్థ వలన విద్యార్థులు అధిక ఒత్తిడితో బాధపడుతున్నారని.. అందుకే ప్రతి ఒక్కరూ పరీక్షలలో రాణించలేరని.. కేవలం పరీక్షలు మాత్రమే వారి ప్రపంచం కాదని అన్నారు సుధీష్. కేరళలో 99.47 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. అంటే దాదాపు 200 మందిలో ఒకరికి మాత్రమే అవకాశం ఉంటుంది. గత నాలుగు రోజులుగా తల్లిదండ్రులు, విద్యార్థుల నుంచి పెద్ద సంఖ్యలో దీనిపై చర్చ జరిగింది. పరీక్షకలలో ఫెయిల్ అయిన విద్యార్థులకు ఒత్తిడి అధిగమించేందుకు తమ హిల్ స్టేషన్లో ఉచిత వసతి కల్పిస్తున్నట్లుగా సుధీష్ ప్రకటించారు. దీంతో సోషల్ మీడియా వేదికగా భారీ సంఖ్యలో రెస్పాన్స్ వస్తుంది. అందుకు సంబంధించిన నియమాలను తెలుసుకోవడానికి విద్యార్థులు ఆసక్తి చూపిస్తున్నారు.
ఈ మేరకు సుధీష్ ఇంటర్నెట్లో ” మంచి మార్కులు సాధించిన విద్యార్థులు సోషల్ మీడియాలో తమ గ్రేడ్స్ గురించి ఎంతో ఆనందంగా చెప్పుకుంటున్నారు. కానీ ఫెయిల్ అయిన విద్యార్థులు ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కోంటున్నారు. దీని ద్వారా వారు మరింత ఒత్తిడి చెందుతున్నట్లుగా భావిస్తున్నాను. అందుకే అలాంటి వారికి మా హిల్ స్టేషన్లలో తాత్కాలిక వసతి ఇవ్వాలనుకుంటున్నాను ” అంటూ ట్వీట్ చేశాడు. అయితే ఇది ప్రస్తుతానికి కేరళ విద్యార్థులకు మాత్రం అవకాశం కల్పించనున్నామని.. రెస్పాన్స్‌ను బట్టి ఇతర రాష్ట్రాల వారికి కూడా అవకాశం ఇవ్వనున్నట్లు చెప్పారు. అయితే ఈ హిల్ స్టేషన్‌కు కేవలం తల్లిదండ్రులతో కలిసి వచ్చేందుకు మాత్రమే ఛాన్స్ ఉంది.
Also Read: Venkatesh: డిజిటల్ ఎంట్రీ ఇవ్వనున్న వెంకీ.. రానాతో కలిసి నయా వెబ్ సిరీస్‌కు ప్లాన్..