ఇంట్లోంచి బయటికే రాని కుటుంబం! ఏమైందని పక్కింటోళ్లు వెళ్లి చూస్తే.. నాలుగు మృతదేహాలు వేలాడుతూ..
కేరళలోని ఇడుక్కీ జిల్లా ఉప్పుతరలో దారుణ ఘటన చోటుచేసుకుంది. 34 ఏళ్ల సజీవ్, 30 ఏళ్ల రేష్మ, వారి ఇద్దరు పిల్లలు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో ఈ ఘటన జరిగిందని అనుమానిస్తున్నారు. పక్కింటి వారు గమనించి పోలీసులకు సమాచారం అందించారు.

బంగారం లాంటి ఇద్దరు పిల్లలతో దంపతులు ఓ ఇంట్లో నివాసం ఉంటున్నారు. అయితే ఓ రోజు ఉదయం నుంచి అసలు ఆ ఇంట్లో నుంచి ఒక్కరు కూడా బయటికి రాలేదు. మధ్యాహ్నం అవుతున్నా.. ఒక్కరు కూడా ఇంట్లో నుంచి బయటి రాకపోవడం, వేసిన తలుపులు వేసినట్లే ఉండటంతో అనుమానం వచ్చిన పక్కింటి వాళ్లు.. వెళ్లి చూడగా ఒక్కసారిగా షాక్ అయ్యారు. భయంతో వారి గుండెల్లో రైళ్లు పరిగెట్టాయి. నలుగురు కూడా ఉరివేసుకొని వేలాడుతున్నారు. ఆ సీన్స్ చూసి భయంతో వణికిపోతూనే.. పక్కింటి వాళ్లు పోలీసులు సమాచారం ఇచ్చారు. కుటుంబం మొత్తం ఒకేసారి ఉరివేసుకోవడంతో పోలీసులు కూడా షాక్ అయ్యారు.
ఈ ఘటన.. కేరళలోని ఇడుక్కి జిల్లాలోని హై రేంజ్ గ్రామమైన ఉప్పుతరలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొన్ని రోజులుగా ఆ కుటుంబంలో ఒక్కరు కూడా కనిపించకపోవడంతో అనుమానం వచ్చిన పక్కింటి వాళ్లు గురువారం సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో వెళ్లి చూడగా లివింగ్ రూమ్‌లో మృతదేహాలు వేలాడుతూ కనిపించాయి. మృతులను సజీవ్ మోహనన్ (34), అతని భార్య రేష్మ (30), వారి ఇద్దరు పిల్లలు 1వ తరగతి చదువుతున్న ఆరేళ్ల బాలుడు, నాలుగేళ్ల బాలికగా అధికారులు గుర్తించారు.
ప్రాథమిక దర్యాప్తులో ఇది ఆత్మహత్య కేసుగా నమోదు చేసుకున్నారు. ఉప్పుతరలోని పట్టతంబలంకు చెందిన ఆటో రిక్షా డ్రైవర్ సజీవ్ ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నాడని పొరుగువారు పోలీసులకు తెలిపారు. ముందుగా పిల్లలకు ఉరి వేసి.. ఆ తర్వాత దంపతులు కూడా ఆత్మహత్య చేసుకొని ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. పూర్తి స్థాయి దర్యాప్తు తర్వాత ఈ సంఘటనకు సంబంధించిన అసలు కారణం బయటపడే అవకాశం ఉంది. కాగా కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకోవడంతో ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
