Karnataka: కర్ణాటక సర్కార్ కీలక నిర్ణయం.. నైట్ కర్ఫ్యూ ఎత్తివేత.. స్కూళ్లు సైతం ఓపెన్..
Night Curfew - Schools: దేశంలో కరోనా కేసులు ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతున్నాయి. ఈ క్రమంలో పలు రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూ, స్కూళ్ల ప్రారంభంపై
Night Curfew – Schools: దేశంలో కరోనా కేసులు ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతున్నాయి. ఈ క్రమంలో పలు రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూ, స్కూళ్ల ప్రారంభంపై నిర్ణయాలు తీసుకుంటున్నాయి. అయితే.. కర్ణాటక (Karnataka) లో కరోనా కేసులు పెరగడంతో ప్రభుత్వం నైట్ కర్ఫ్యూ విధించిన సంగతి తెలిసిందే. అయితే రాష్ట్రంలో కేసులు తగ్గుముఖం పట్టడంతో కర్ణాటక ప్రభుత్వం శనివారం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో విధించిన ఆంక్షలను సడలిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కర్ణాటకలో సోమవారం (జనవరి 31) నుంచి నైట్ కర్ఫ్యూను ఎత్తివేయనున్నట్టు బొమ్మై ప్రభుత్వం ప్రకటించింది. బెంగళూరు (Bengaluru) లో క్లాసులు కూడా పునఃప్రారంభం చేయనున్నట్లు తెలిపింది. గత 15 రోజులుగా కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ.. రాష్ట్రంలో మెరుగైన రికవరీ రేటు ఉందని, ఆస్పత్రుల్లో చేరేవారి సంఖ్య కూడా తక్కువగానే ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది.
రాష్ట్రంలో పాఠశాలలను, కళాశాలలను సోమవారం నుంచి తెరవనున్నట్లు రాష్ట్ర మంత్రి బీసీ నగేశ్ వెల్లడించారు. బెంగుళూరులో సైతం స్కూళ్లు తెరుచుకుంటాయని పేర్కొన్నారు. కరోనా నిబంధనలను తప్పనిసరిగా పాటించేలా అన్ని శాఖలకు ఆదేశాలు జారీ చేసినట్లు నగేశ్ వెల్లడించారు. వివాహ వేడుకల్లో నిబంధనలు ఎత్తేస్తున్నట్టు తెలిపారు. ఇండోర్‌లో జరిగే పెళ్లి వేడుకలకు 200 మంది, ఔట్‌డోర్‌లో జరిగే వేడుకలకు 300 మంది హజరయ్యేందుకు అనుమతి ఉందన్నారు.
50 శాతం సామర్థ్యంతో క్రీడా మైదానాలు, జిమ్‌లు, బార్లు, హోటళ్లను తెరిచేందుకు అనుమతి ఇచ్చారు. ప్రభుత్వ కార్యాలయాల్లో 100 శాతం ఉద్యోగులతో పనిచేయనున్నట్లు మంత్రి నరేశ్ పేర్కొన్నారు. ఆలయాల్లో పూజలకు సైతం అనుమతి ఇచ్చినట్లు పేర్కొన్నారు. అయితే.. రాష్ట్రంలో ధర్నాలు, మతపరమైన, రాజకీయమైన కార్యక్రమాలకు మాత్రం అనుమతి లేదని మంత్రి నగేశ్ స్పష్టంచేశారు.
Also Read: