AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: పడవ నిండా జనం.. క్షణంలో ఒడ్డుకు చేరుతారనగా బోల్తా.. షాకింగ్ వీడియో

Boat Capsize: అందరూ విందుకు హాజరై పడవలో వస్తున్నారు.. ఈ క్రమంలో సంతోషం కాస్త విషాదకరంగా మారింది. ఒడ్డుకు మరికొన్ని క్షణాల్లో చేరుతుందనగా

Watch Video: పడవ నిండా జనం.. క్షణంలో ఒడ్డుకు చేరుతారనగా బోల్తా.. షాకింగ్ వీడియో
Boat Capsize
Shaik Madar Saheb
|

Updated on: Jan 29, 2022 | 3:43 PM

Share

Boat Capsize: అందరూ విందుకు హాజరై పడవలో వస్తున్నారు.. ఈ క్రమంలో సంతోషం కాస్త విషాదకరంగా మారింది. ఒడ్డుకు మరికొన్ని క్షణాల్లో చేరుతుందనగా పడవ బోల్తా పడటంతో దానిలో ఉన్న 10 మంది గల్లంతయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌ (Madhya Pradesh) లోని భింద్‌లో శుక్రవారం చోటుచేసుకుంది. పడవ నదిలో బోల్తా పడిన ఒక రోజు తర్వాత.. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భింద్ జిల్లాలోని సింధ్ నదిలో శుక్రవారం పడవ బోల్తా ప్రమాదంలో ఇద్దరు గల్లంతయ్యారు. నది ఒడ్డున ఉన్న ఒక వ్యక్తి ఈ వీడియోను చిత్రీకరించారు. 10 మంది వ్యక్తుల బృందం మతపరమైన విందుకు హాజరై తిరిగి వస్తున్నారు. ఒడ్డుకు కేవలం కొంత దూరంలో ఉండగానే పడవ బోల్తా (Boat Capsize) పడిపోవడం కనిపిస్తుంది. దీంతో ఒడ్డున నిలబడిన వ్యక్తులు వారిని రక్షించడానికి నదిలోకి దూకుతారు.

కాగా.. ఈ ఘటనలో ఎనిమిది మందిని రక్షించగా.. ఓ యువతి, యువకులు కనిపించకుండా పోయారని పోలీసులు తెలిపారు. వారికోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నదికి అవతలి వైపు జరిగిన మతపరమైన విందులో పాల్గొని తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. భింద్ పట్టణానికి 40 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం జరిగిందని నయగావ్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ నరేంద్ర సింగ్ కుష్వాహ తెలిపారు.

వీడియో..

ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్‌కు చెందిన ద్రౌపతి బాఘేల్ (16), ఓం బాఘేల్ (13) గల్లంతయ్యారని తెలిపారు. వారికోసం గజఈతగాళ్ల సాయంతో గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Also Read:

Punjab Election 2022: ఒక ఒరలో రెండు కత్తులు.. పంజాబ్‌లో కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో తెలుసా..?

East Godavari District: ‘ప్రేమతో డబ్బు, బంగారం ఇచ్చా.. తనేమో హ్యాండిచ్చింది’.. యువకుడు ఆత్యహత్య