AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

East Godavari District: ‘ప్రేమతో డబ్బు, బంగారం ఇచ్చా.. తనేమో హ్యాండిచ్చింది’.. యువకుడు ఆత్యహత్య

అమ్మాయి మోసం చేసిందని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. తూర్పు గోదావరి జిల్లా అయినవిల్లి మండలం మాగం కొప్పిశెట్టివారి పాలెంలో ఈ దారుణం వెలుగుచూసింది.

East Godavari District: 'ప్రేమతో డబ్బు, బంగారం ఇచ్చా.. తనేమో హ్యాండిచ్చింది'.. యువకుడు ఆత్యహత్య
Suicide
Ram Naramaneni
|

Updated on: Jan 29, 2022 | 10:51 AM

Share

Love Failure: ప్రేమో, ఆకర్షణో తెలీదు. ఇష్టపడ్డవారు దక్కలేదన్న మనస్తాపంతో యువత నిండు జీవితాలను బలి చేసుకుంటున్నారు. బోలెండంత భవిష్యత్ ను, ఇప్పటివరకు పెంచి పెద్దచేసిన తల్లిదండ్రులను పట్టించుకోకుండా తనువు చాలిస్తున్నారు. తాజాగా అమ్మాయి మోసం(Love Cheating) చేసిందని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. తూర్పు గోదావరి జిల్లా అయినవిల్లి మండలం(Ainavilli Mandal)మాగం కొప్పిశెట్టివారి పాలెంలో ఈ దారుణం వెలుగుచూసింది. వెంకట్రావ్(పేరు మార్చాం) అనే యువకుడు గత కొంతకాలంగా ఒక అమ్మాయితో ప్రేమలో ఉన్నాడు. ఈ క్రమంలో ఆమెకు చాలా గిఫ్ట్స్ ఇచ్చాడు. డబ్బు ఇచ్చాడు.  బంగారం, దుస్తులు కొనిపెట్టాడు. తనకు కాబోయే భార్య కదా అని అతడు ఇవన్నీ చేశాడు. కానీ యువతి హ్యాండ్ ఇచ్చింది. ఇద్దరికీ సెట్ అవ్వదని.. గుడ్ బై చేప్పేసింది. వెంకట్రావ్ ను కలిసేందుకు కూడా నో చెప్పింది. తనకు మరొకరితో పెళ్లి ఫిక్సయ్యిందని.. డిస్టబ్ చేయొద్దంటూ సైడయిపోయింది. దీంతో అతడు మనస్తాపం చెందాడు. తన బాధను ఎవరితో పంచుకోవాలో తెలియలేదు. ఇక చావే శరణ్యమనుకున్నాడు. తన ఆవేదనను తెలిపేందుకు వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి.. అందులో ఇద్దరు కలిసి ఉన్న ఫోటోలు, వీడియోలు షేర్ చేశాడు. అమ్మాయి మోసం చేసినందుకే చనిపోతున్నా అంటూ సెల్ఫ్ వీడియోలో తీసి.. ఉరి వేసుకున్నాడు. కాగా గతంలోనే ఈ యువకుడికి పెళ్ళైనట్టు, భార్యతో విడిపోయినట్టు తెలుస్తోంది. దీనిపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

(ఆత్మహత్య సమస్యకు పరిష్కారం కాదు. మీరు డిప్రెషన్, ఇతర సమస్యలతో ఇబ్బంది పడుతుంటే మానసిక ఆరోగ్య నిపుణులను సంప్రదించండి)

Also Read: Nellore District: గతంలో భార్య ఉరి వేసుకుంటుంటే వీడియో తీసిన పెంచలయ్య ఆత్మహత్యాయత్నం

 శ్మశానం దగ్గర్లోని నిర్మానుష్య ప్రాంతం వద్ద కనిపించిన రంధ్రాలు.. దిగి చెక్ చేయగా అద్భుతం