Karnataka Election Results: కర్నాటకలో కాంగ్రెస్‌వైపే తెలుగు ఓటర్లు మొగ్గు.. ప్రముఖులు ప్రచారం చేసినా పట్టించుకోలే..!
కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగు ఓటర్లు కాంగ్రెస్‌కే పట్టం కట్టారు. మొత్తం 224 సీట్లలో తెలుగు ఓటర్లు దాదాపు 32 నియోజకవర్గాల్లో ప్రభావం చూపించే సంఖ్యలో ఉన్నారు. వీళ్లందరికీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. తాజా ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్, బీజేపీ నేతలు కర్నాటక వెళ్లి ఆయా నియోజకవర్గాల్లో విస్తృత ప్రచారం చేశారు కూడా.

కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగు ఓటర్లు కాంగ్రెస్‌కే పట్టం కట్టారు. మొత్తం 224 సీట్లలో తెలుగు ఓటర్లు దాదాపు 32 నియోజకవర్గాల్లో ప్రభావం చూపించే సంఖ్యలో ఉన్నారు. వీళ్లందరికీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. తాజా ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్, బీజేపీ నేతలు కర్నాటక వెళ్లి ఆయా నియోజకవర్గాల్లో విస్తృత ప్రచారం చేశారు కూడా. తెలుగు ఓటర్ల మొగ్గు తప్పకుండా తమకే అని నాయకులు భావించినా.. తెలుగువాళ్లు మాత్రం చేతికే చిక్కారు.
బెంగళూరు శివారుల్లోని దాదాపు 20 నియోజకవర్గాలు.. బళ్లారిలో 6, రాయచూరులో 3, కొప్పళలో 2, చెల్లికెరిలో ఒకచోట తెలుగు ఓటర్లు ఎక్కువ. వీటిల్లో బళ్లారి ప్రాంతంలో గాలి జనార్దన్‌రెడ్డి ఎఫెక్ట్ కనిపించింది. ఈ ప్రాంతంలో ఓట్లు చీలి కాంగ్రెస్ లాభపడింది.
ఈ ఎన్నికల్లో సినీ యాక్టర్లు కూడా ప్రచారంలో తళుక్కుమన్నారు. స్టార్ కమెడియన్ బ్రహ్మానందం చిక్‌బళ్లాపూర్‌లో బీజేపీ అభ్యర్థి, మంత్రి డాక్టర్ సుధాకర్ తరపున ప్రచారం చేసి చర్చల్లో నిలిచారు. సుధాకర్‌తో తనకున్న పరిచయాలతోనే ప్రచారానికి వచ్చినట్టు స్వయంగా బ్రహ్మానందమే ప్రకటించారు. కానీ.. తాజా ఎన్నికల్లో డాక్టర్ సుధాకర్ ఓడిపోయారు.




ఇక గత కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేసి ఓడిన నటుడు సాయికుమార్.. ఈ దఫా మాత్రం బరిలో దిగలేదు. కాకపోతే బీజేపీ తరఫున ఎన్నికల ప్రచారం చేశారు. కాంగ్రెస్ పార్టీ హవాలో సాయికుమార్ ప్రచారం కూడా తేలిపోయింది.
విలక్షణ నటుడు ప్రకాష్‌రాజ్ సొంత రాష్ట్రం కర్నాటకే అయినప్పటికీ.. ఎన్నికల్లో పోటీ చేయలేదు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ప్రకాష్‌రాజ్ ఓడిపోయారు. ఈ దఫా కేవలం ఓటు హక్కు వినియోగించుకుని సైలెంట్ అయ్యారు ప్రకాష్‌రాజ్. మతతత్వ పార్టీలకు ఓటేయొద్దని మాత్రమే పిలుపు ఇచ్చారు. ప్రకాష్‌రాజ్ బీజేపీకి పూర్తిగా యాంటీ కావడంతో తాజా ఫలితాలు ఆయన ఆశించినట్టుగానే వచ్చాయనే చర్చ జరుగుతోంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..




