Karnataka Results: మళ్లీ అదే ట్రెండ్ కొనసాగించిన కన్నడ ఓటర్లు.. ఈసారి కూడా
కర్నాటక ఫలితాలు చూస్తుంటే 38 ఏళ్ల ట్రెండ్‌ను కన్నడ ఓటర్లు కొనసాగిస్తున్నట్టు స్పష్టమవుతోంది. అధికారంలో ఉన్న పార్టీకి తిరిగి అధికారం అప్పగించకూడదన్న సంప్రదాయం ఈ ఎన్నికల్లోనూ కనిపించింది. 2018 ఫలితాలతో పోల్చితే ఈసారి కన్నడ ఓటర్లు విస్పష్టమైన తీర్పు ఇచ్చినట్టు ట్రెండ్స్ కనబడుతున్నాయి....

కర్నాటక ఫలితాలు చూస్తుంటే 38 ఏళ్ల ట్రెండ్‌ను కన్నడ ఓటర్లు కొనసాగిస్తున్నట్టు స్పష్టమవుతోంది. అధికారంలో ఉన్న పార్టీకి తిరిగి అధికారం అప్పగించకూడదన్న సంప్రదాయం ఈ ఎన్నికల్లోనూ కనిపించింది. 2018 ఫలితాలతో పోల్చితే ఈసారి కన్నడ ఓటర్లు విస్పష్టమైన తీర్పు ఇచ్చినట్టు ట్రెండ్స్ కనబడుతున్నాయి. బరిలో 16 పార్టీలు ఉన్నా ప్రధాన పోటీ మాత్రం ఎప్పటిలాగే మూడు ప్రధాన పోటీలు – కాంగ్రెస్, బీజేపీ, JDS మధ్యే కనిపించింది. ఒకసారి స్పష్టమైన మెజార్టీ, మరోసారి హంగ్ తీర్పు ఇచ్చే కన్నడ ఓటర్లు ఈ ఎన్నికల్లోనూ అదే ట్రెండ్ చూపారు.
రిజల్ట్స్ ట్రెండ్స్ చూస్తుంటే కాంగ్రెస్ పార్టీ ఈజీగా 130 స్థానాల్లో విజయం సాధించడం తథ్యంగా కనిపిస్తోంది. ఇప్పటి వరకు వచ్చిన ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ 43 శాతం ఓట్లు సాధించింది. ఇక 1985 తర్వాత ఇంత వరకు కర్నాటకలో అధికారంలో ఉన్న పార్టీ తిరిగి అధికారాన్ని చేపట్టకపోవడం సంప్రదాయంగా మారింది. ఈసారి ఈ చరిత్రను తిరగరాసేందుకు బీజేపీ తీవ్రంగా శ్రమించింది. కాని కర్నాటక ఓటర్లు తమ సంప్రదాయాన్ని మార్చుకునేది లేదని మరోసారి స్పష్టం చేశారు.
ఇదిలా ఉంటే వాస్తవానికి దక్షిణ భారతదేశంలోని కేరళ, తమిళనాడు, కర్నాటకలో ప్రతీ ఐదేళ్లకోసారి ప్రభుత్వాన్ని మార్చే సంప్రదాయం కొన్ని దశాబ్దాలుగా సాగుతోంది. కానీ, తమిళనాడు ఓటర్లు గతంలో వరుసగా రెండుసార్లు జయలలిత నాయకత్వంలో అన్నాడీఎంకేని గెలిపించి సంప్రదాయాన్ని తిరగరాశారు. అలాగే కేరళ ఓటర్లు కూడా వరుసగా రెండుసార్లు LDFను గెలిపించి కొత్త ట్రెండ్ సృష్టించారు. ఈ క్రమంలో కర్నాటకలోనూ కొత్త సంప్రదాయం మొదలు కావచ్చని కొత్త మంది ఎన్నికల విశ్లేషకులు అంచనా వేశారు. కాని, కన్నడ ఓటర్లు మాత్రమే తమ పాత సంప్రదాయనికే మొగ్గు చూపారు.




మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..




