గో వధ నిషేధం దిశగా అడుగులు వేస్తున్న కన్నడ ప్రభుత్వం

గో వధ, బీఫ్‌ అమ్మకాలపై నిషేధం విధించే దిశగా కర్ణాటక ప్రభుత్వం అడుగులు వేస్తోంది. గో వధ నిషేధం, పరిరక్షణ బిల్లు-2012ను తిరిగి తీసుకురావాలని చూస్తోంది. ఇతర రాష్ట్రాల్లో గో వధ నిషేధం, బీఫ్ అమ్మాకాల..

గో వధ నిషేధం దిశగా అడుగులు వేస్తున్న కన్నడ ప్రభుత్వం
Follow us

| Edited By:

Updated on: Jul 11, 2020 | 4:35 PM

గో వధ, బీఫ్‌ అమ్మకాలపై నిషేధం విధించే దిశగా కర్ణాటక ప్రభుత్వం అడుగులు వేస్తోంది. గో వధ నిషేధం, పరిరక్షణ బిల్లు-2012ను తిరిగి తీసుకురావాలని చూస్తోంది. ఇతర రాష్ట్రాల్లో గో వధ నిషేధం, బీఫ్ అమ్మాకాల నిషేధంపై అమలవుతున్న చట్టాలను పరిశీలిస్తున్నామని.. కర్ణాటక పశు సంవర్ధక శాఖ మంత్రి తెలిపారు. ఇతర రాష్ట్రాల్లో ఇప్పటికే ఆమోధించిన బిల్లులను పరిశీలించేందుకు ప్రత్యేక టీంలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇప్పటికే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో గో వధ నిషేధ చట్టాన్ని అమలు చేస్తున్నారు.

తాజాగా గత నెలలో యూపీలోని యోగీ సర్కార్‌ కూడా గో వధ నిషేధ చట్టాన్ని తీసుకోచ్చిన సంగతి తెలిసిందే. ఏవరైనా గోవును వధిస్తే.. తొలిసారి రెండేళ్ల జైలు శిక్షతో పాటు భారీ జరిమానా కూడా విధించేలా చట్టాన్ని తీసుకొచ్చారు. అంతేకాదు రెండో సారి గోవును వధిస్తే.. వారిపై పదేళ్ల జైలు శిక్షతో పాటు భారీగా జరిమానా కూడా విధించేలా చట్టాన్ని రూపకల్పన చేసింది. అయితే ఇదే క్రమంలో కర్ణాటక ప్రభుత్వం కూడా రాష్ట్రంలో గో వధ నిషేధ చట్టాన్ని తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తోంది. కాగా, 2018 ఎన్నికల్లో అధికారంలోకి వస్తే గో వధ నిషేధ చట్టాన్ని తీసుకువస్తామని బీజేపీ ఎన్నికల సమయంలో ప్రజలకు హామీ కూడా ఇచ్చింది.

మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..