కరోనా వైరస్ పై ప్రధాని మోదీ సమీక్ష.. రాష్ట్రాలకు ప్రశంస

దేశంలో కరోనా వైరస్ పై ప్రధాని మోదీ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. వ్యక్తిగత ఆరోగ్యం, బహిరంగ ప్రదేశాల్లో సామాజిక క్రమశిక్షణ, కోవిడ్-19 పై అవగాహన ముఖ్యమని, ఈ మూడింటితో ఈ వైరస్ ని దూరం చేయవచ్ఛునని ఆయన..

కరోనా వైరస్ పై ప్రధాని మోదీ సమీక్ష.. రాష్ట్రాలకు ప్రశంస
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jul 11, 2020 | 4:40 PM

దేశంలో కరోనా వైరస్ పై ప్రధాని మోదీ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. వ్యక్తిగత ఆరోగ్యం, బహిరంగ ప్రదేశాల్లో సామాజిక క్రమశిక్షణ, కోవిడ్-19 పై అవగాహన ముఖ్యమని, ఈ మూడింటితో ఈ వైరస్ ని దూరం చేయవచ్ఛునని ఆయన అన్నారు. దీని కట్టడికి కేంద్రంతో బాటు ఆయా రాష్ట్రాలు చేస్తున్న కృషిని ఆయన ప్రశంసించారు. ముఖ్యంగా ఢిల్లీ గురించి ప్రస్తావిస్తూ ఇదే తరహా కంట్రోలింగ్ విధానాన్ని అన్ని రాష్ట్రాలూ పాటించాలన్నారు. అహమ్మదాబాద్ లో ‘ ధన్వంతరి రథ్’ పేరిట అమలు చేస్తున్న గృహ సంబంధ ‘సర్వేలెన్స్’ మంచి ఫలితాలనిస్తోందని మోదీ చెప్పారు. ఇతర చోట్ల కూడా ఈ విధమైన పధ్దతిని చేపట్టవచ్చునని మోదీ అభిప్రాయపడ్డారు. ఈ సమావేశంలో హోం మంత్రి అమిత్ షా. ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్, నీతి ఆయోగ్ సభ్యుడు, కేబినేట్ కార్యదర్శి, ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు.

కాగా…. దేశంలో ఒక్క రోజులో 27,114 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 8,20,916 కి చేరింది. వీటిలో 2,83,407 యాక్టివ్ కేసులు కాగా.. 5,15,387 మంది రోగులు కోలుకున్నారు.