Karnataka: స్కూల్ కు వెళ్లి ఇంటికి తిరిగి రాని టీచర్.. శవమై కనిపించింది…
టీచర్ దీపిక శవమై కనిపించింది. 28 ఏళ్ల దీపిక మృతదేహం మేలుకోటెలోని యోగ నరసింహ స్వామి బెట్ట దిగువన ఉన్న ఖాళీ స్థలంలో ఖననం చేయబడింది. దీపిక వివాహిత. భర్త లోకేష్.. ఈ దంపతులకు 8 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. మృతురాలు కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. మృతురాలు దీపిక మేలుకోటేలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో కాంట్రాక్ట్ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది. ఈ నెల 20వ తేదీ శనివారం పాఠశాలకు వెళ్లిన దీపిక తన విధులను ముగించుకున్న అనంతరం సాయంత్రం ఇంటికి రాలేదు.

స్కూల్ కు వెళ్లి అదృశ్యమైన టీచర్ చివరకు శవమై కనిపించింది. జనవరి 20వ తేదీ నుంచి కనిపించకుండా పోయిన ఈ ఉపాధ్యాయురాల మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఈ దారుణ ఘటన కర్నాటక మండ్య జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని పాండవపూర్ మాణిక్యహళ్లికి చెందిన టీచర్ దీపిక శవమై కనిపించింది. 28 ఏళ్ల దీపిక మృతదేహం మేలుకోటెలోని యోగ నరసింహ స్వామి బెట్ట దిగువన ఉన్న ఖాళీ స్థలంలో ఖననం చేయబడింది. దీపిక వివాహిత. భర్త లోకేష్.. ఈ దంపతులకు 8 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. మృతురాలు కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. మృతురాలు దీపిక మేలుకోటేలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో కాంట్రాక్ట్ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది. ఈ నెల 20వ తేదీ శనివారం పాఠశాలకు వెళ్లిన దీపిక తన విధులను ముగించుకున్న అనంతరం సాయంత్రం ఇంటికి రాలేదు. చాలా సేపు దీపిక కోసం ఎదురుచూశారు. అయినప్పటికీ దీపక ఇంటికి తిరిగి రాకపోవంతో తల్లిదండ్రులు తమ అల్లుడితో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మేలుకోటె పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. దర్యాప్తు చేపట్టిన పోలీసులకు సోమవారం సాయంత్రం మేలుకోటే కొండ దిగువన దీపిక మృతదేహం లభ్యమైంది. దీపిక హత్య చేసి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం పాండవాపూర్ తాళ్లూరు ఆస్పత్రికి తరలించారు. పోస్ట్‌మార్టం రిజల్ట్ వచ్చిన తర్వాతే దీపిక మృతికి కచ్చితమైన కారణం తెలిసే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








