Viral Video: ఒడిశా కళాకారుడి అద్భుత సృష్టి.. అగ్గిపుల్లలతో రామ మందిరం.. ప్రధానికి ఇవ్వాలని కోరిక

అయోధ్య నుండే కాకుండా దేశం నలుమూలల నుండి వివిధ రకాల చిత్రాలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. వీటిని చూసి ప్రజల హృదయాలు ఆనందంతో నిండిపోయాయి. ఇటీవల ఒక వ్యక్తి పార్లేజీ బిస్కెట్లను ఉపయోగించి రామాలయాన్ని నిర్మించాడు. ఇప్పుడు ఒక వ్యక్తి అగ్గిపుల్లలను ఉపయోగించి రామ మందిరాన్ని తయారు చేసి అందరి హృదయాలను గెలుచుకున్నాడు. ఈ అగ్గిపుల్లల రామ మందిర వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Viral Video: ఒడిశా కళాకారుడి అద్భుత సృష్టి.. అగ్గిపుల్లలతో రామ మందిరం.. ప్రధానికి ఇవ్వాలని కోరిక
Ayodhya Temple
Follow us

|

Updated on: Jan 23, 2024 | 11:14 AM

2024 జనవరి 24 వ తేదీ దేశం మొత్తానికి ప్రత్యేకమైన రోజుగా చరిత్రలో నిలిచిపోయింది. ఎందుకంటే అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం జరిగిన రోజు. ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సహా దేశం నలుమూలల నుండి సెలబ్రేతీలు, భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఎక్కడ చూసినా రాముడి నామం మార్మోగింది. ఈ సందర్భంగా అయోధ్య నుండే కాకుండా దేశం నలుమూలల నుండి వివిధ రకాల చిత్రాలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. వీటిని చూసి ప్రజల హృదయాలు ఆనందంతో నిండిపోయాయి. ఇటీవల ఒక వ్యక్తి పార్లేజీ బిస్కెట్లను ఉపయోగించి రామాలయాన్ని నిర్మించాడు. ఇప్పుడు ఒక వ్యక్తి అగ్గిపుల్లలను ఉపయోగించి రామ మందిరాన్ని తయారు చేసి అందరి హృదయాలను గెలుచుకున్నాడు. ఈ అగ్గిపుల్లల రామ మందిర వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఒడిశాకు చెందిన సాస్వత్ రంజన్ వృత్తి రీత్యా శిల్పి. అతను అగ్గిపుల్లలను ఉపయోగించి అయోధ్య రామాలయ ప్రతిరూపాన్ని అద్భుతంగా సృష్టించాడు. ANI నివేదిక ప్రకారం రామ మందిరం ప్రతిరూపాన్ని తయారు చేయడానికి తనకు మొత్తం ఆరు రోజులు పట్టిందని, మొత్తం 936 అగ్గిపుల్లలను ఉపయోగించారని సాస్వత్ చెప్పారు. ఈ ఆలయం 4 అంగుళాల పొడవు, 7 అంగుళాల వెడల్పుతో ఉంటుంది.. ఇంతకంటే చిన్న రామ మందిరాన్ని అగ్గిపుల్లతో నిర్మించవచ్చని నేననుకోవడం లేదని సాస్వత్ చెప్పారు. ఈ రామ మందిరాన్ని ప్రధాని మోడీకి అప్పగించాలనుకుంటున్నట్లు చెప్పారు. కనుక తన కోరిక తీర్చడానికి ఎవరైనా సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాడు ఈ కళాకారుడు.

ఇవి కూడా చదవండి

అగ్గిపుల్లలను ఉపయోగించి రామమందిర నిర్మాణం

ప్రముఖ మీడియా సంస్థ ANIతన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌లో ఈ ప్రత్యేకమైన రామాలయం చిత్రాలను పంచుకుంది. వాటిలో కొన్నింటిలో సాస్వత్ ఆలయాన్ని నిర్మిస్తున్నట్లు కనిపిస్తున్నాడు. కొన్నింటిలో అతను ఆలయాన్ని ప్రజలకు చూపిస్తున్నాడు. ఈ చిత్రాలను వేలాది సార్లు వీక్షించగా, వందలాది మంది ప్రజలు వాటిని లైక్ చేసారు. వివిధ రకాల రియాక్షన్‌లు ఇచ్చారు. ‘మన భారతదేశంలో ప్రతిభకు కొదవలేదు’ అని ఒక వినియోగదారు రాస్తే, మరొక వినియోగదారు అతన్ని గొప్ప ప్రతిభావంతుడు అని కూడా పేర్కొన్నారు.

తాజాగా పశ్చిమ బెంగాల్ కు చెందిన ఓ కుర్రాడు కూడా ఇలాంటి ఆర్ట్ వర్క్ చేసి ఫేమస్ అయ్యాడు. అతను 20 కిలోల పార్లేజీ బిస్కెట్లతో విశిష్టమైన, అద్భుతమైన రామ మందిరాన్ని తయారు చేసాడు. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..