AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Karnataka: కన్నడ పూజారులకు సిద్దరామయ్య ప్రభుత్వం షాక్.. ఆలయ ఆదాయం తగ్గింది.. 10 ఏళ్ల జీతం వెనక్కి ఇవ్వమని నోటీసులు

కన్నడలో రాముడికి పూజలు చేసే పూజారి హిరేమగలూరు కన్నన్ కు సిద్ధరామయ్య ప్రభుత్వం షాక్ ఇచ్చింది. గత ఏడాదిలోనే కన్నన్ జీతాన్ని ప్రభుత్వం నిలిపివేసింది. ఇప్పుడు ఇప్పటి వరకూ తీసుకున్న జీతాన్ని ప్రభుత్వానికి తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేసింది. నెలకు పూజారి హిరేమగలూరు కన్నన్ కు వేతనంగా రూ.4500 చెల్లిస్తూ ఉండేవారు ఇలా 10 ఏళ్లకు గాను 4,74,000లను చెల్లించారు. ఈ మొత్తాన్ని పండితులు, పూజారి హిరేమగళూరు కన్నన్‌ ప్రభుత్వానికి డబ్బు తిరిగి ఇవ్వాలని జిల్లా యంత్రాంగం నోటీసు జారీ చేసింది. 

Karnataka: కన్నడ పూజారులకు సిద్దరామయ్య ప్రభుత్వం షాక్.. ఆలయ ఆదాయం తగ్గింది.. 10 ఏళ్ల జీతం వెనక్కి ఇవ్వమని నోటీసులు
Priest Hiremagaluru Kannan
Follow us
Surya Kala

|

Updated on: Jan 23, 2024 | 12:07 PM

కర్ణాటకలోని ఆలయ పూజారులకు ప్రభుత్వం షాక్ ఇచ్చింది. రాష్ట్రంలో ఆలయంలో పూజలు చేసే అర్చకులు 10 ఏళ్లుగా తీసుకున్న వేతనాన్ని తిరిగి ఇవ్వాలని అర్చకులందరికీ ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. అవును.. అర్చకులకు ఇచ్చే జీతం తిరిగి ప్రభుత్వానికి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. కన్నడ పండితుడు, ప్రముఖ పూజారి హిరేమగళూరు కన్నన్ సహా పలువురికి నోటీసులు జారీ అయ్యాయి. చిక్‌మగళూరు జిల్లా యంత్రాంగం పే ఫ్రీజ్ నోటీసును జారీ చేసింది. మీరు పూజలు చేస్తున్న ఆలయాల్లో  ఆదాయం తగ్గింది. కానీ ప్రభుత్వం ద్వారా ఎక్కువ జీతం తీసుకున్నారు. కనుక గత 10 సంవత్సరాలుగా తీసుకున్న జీతాన్ని తిరిగి ప్రభుత్వానికి ఇవ్వాలంటూ సిద్దరామయ్య సర్కార్ డిమాండ్ చేసింది.

ముఖ్యంగా కన్నడలో రాముడికి పూజలు చేసే పూజారి హిరేమగలూరు కన్నన్ కు సిద్ధరామయ్య ప్రభుత్వం షాక్ ఇచ్చింది. గత ఏడాదిలోనే కన్నన్ జీతాన్ని ప్రభుత్వం నిలిపివేసింది. ఇప్పుడు ఇప్పటి వరకూ తీసుకున్న జీతాన్ని ప్రభుత్వానికి తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేసింది. నెలకు పూజారి హిరేమగలూరు కన్నన్ కు వేతనంగా రూ.4500 చెల్లిస్తూ ఉండేవారు ఇలా 10 ఏళ్లకు గాను 4,74,000లను చెల్లించారు. ఈ మొత్తాన్ని పండితులు, పూజారి హిరేమగళూరు కన్నన్‌ ప్రభుత్వానికి డబ్బు తిరిగి ఇవ్వాలని జిల్లా యంత్రాంగం నోటీసు జారీ చేసింది.

కన్నడ పండితుడిగా, కన్నడ పూజారిగా పేరుగాంచిన హిరేమగళూరు కన్నన్ గత 50 ఏళ్లుగా చిక్కమగళూరు శివార్లలోని కల్యాణ కోదండ రామ మందిరానికి ప్రధాన అర్చకుడిగా సేవలందిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం 10 ఏళ్ల క్రితం వరకూ నెలకు 7500 రూపాయలు. చెల్లిస్తూ ఉండేది. అయితే ప్రస్తుతం ఆలయ ఆదాయం తక్కువగా ఉండడంతో ఇప్పుడు నెలకు రూ. 4500 జీతం చెల్లిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

కన్నడ భాషలోమంత్రాలు చదువుతూ పూజలు

ఈ ఆలయంలోని సీతా రామ లక్ష్మణులకు రోజూ కన్నడ భాషలో మంత్రాలు పఠిస్తూ పూజించడం విశేషం. కన్నడ పూజారిగా ప్రసిద్ధి చెందిన హిరేమగలూరు కన్నన్ నేతృత్వంలో కన్నడ భాషలో కల్యాణ రాముడికి కన్నడ పూజలు నిర్వహిస్తారు. రాష్ట్రము నుంచి మాత్రమే దేశ విదేశాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు కల్యాణరామ దర్శనం చేసుకుంటారు.

కన్నడలో పూజలు చేసే పూజారులకు కష్టాలు

ఒకవైపు ఆ రాష్ట్ర కాంగ్రెస్ నేతలు హిందీ భాషా వ్యతిరేకిస్తూనే ఉన్నారు. అయితే ఇప్పుడు కన్నడలో మంత్రాలు పఠిస్తూ పూజలు చేసే కన్నడ పూజారి హీరేమగలూరు కన్నన్‌కు రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం నోటీసు జారీ చేయడంపై సర్వత్రా నిరసన వ్యక్తం అవుతుంది. ప్రభుత్వం తీరు సరికాదంటూ ప్రజల ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ ప్రభుత్వం నుంచి తీసుకున్న జీతాన్ని తిరిగి ప్రభుత్వానికి ఇవ్వాలని రామాలయ పూజారులకు ప్రభుత్వం ఇప్పుడు నోటీసులు జారీ చేసి సంచలనం సృష్టించింది

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..