PM Modi: అయోధ్య రామాలయ ప్రాణ ప్రతిష్ఠ ఏడాది కాలంపాటూ గుర్తుంటుంది: ప్రధాని మోదీ..

అయోధ్యలో అపూర్వఘట్టం ఆవిష్కృతమైంది. రామాలయ ప్రారంభోత్సవం అంబరాన్నంటింది. నీలమేఘశ్యాముడి ప్రాణప్రతిష్ఠ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. రామజన్మభూమిలో నూతనంగా నిర్మించిన మందిరంలో శ్రీరామచంద్రుడు బాలావతారంలో కొలువు దీరారు. అబ్బురపరిచే విద్యుత్ కాంతుల మధ్య అయోధ్యాపురి దేదీప్యమానంగా వెలిగిపోయింది. దీనిపై దేశ ప్రధాని ట్విట్టర్ వేదికగా స్పందించారు.

PM Modi: అయోధ్య రామాలయ ప్రాణ ప్రతిష్ఠ ఏడాది కాలంపాటూ గుర్తుంటుంది: ప్రధాని మోదీ..
Pm Modi
Follow us
Srikar T

|

Updated on: Jan 23, 2024 | 10:23 AM

ఢిల్లీ, జనవరి 23: అయోధ్యలో అపూర్వఘట్టం ఆవిష్కృతమైంది. రామాలయ ప్రారంభోత్సవం అంబరాన్నంటింది. నీలమేఘశ్యాముడి ప్రాణప్రతిష్ఠ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. రామజన్మభూమిలో నూతనంగా నిర్మించిన మందిరంలో శ్రీరామచంద్రుడు బాలావతారంలో కొలువు దీరారు. అబ్బురపరిచే విద్యుత్ కాంతుల మధ్య అయోధ్యాపురి దేదీప్యమానంగా వెలిగిపోయింది. దీనిపై దేశ ప్రధాని ట్విట్టర్ వేదికగా స్పందించారు. జనవరి 22 , 2024 నుంచి కొత్త శకం ప్రారంభమైంది. ఈ మధుర స్మృతులు వచ్చే ఏడాది వరకు చిరస్థాయిగా నిలిచిపోతాయని పేర్కొన్నారు. కలియుగంలో త్రేతాయుగంనాటి శ్రీరామరాజ్యం ఇక చూడబోతున్నాం..ఇంతటి మహాయజ్ఞంలో మనమూ భాగస్వాములమయ్యాం.. ఆబాలరామచంద్రుడి రూపు..మోము..చూసే మహాద్భాగ్యం మనకు కలిగింది కదా… అంటూ యావత్ భక్త ప్రపంచం మురిసిపోతోంది. శ్రీరామరాజ్యం మన కళ్లముందు ఆవిష్కృతం అయింది. ఐదుశతాబ్దాల తర్వాత వచ్చిన మన రాముడు ఇక మనమధ్యే ఉంటాడని.. మనల్ని చల్లగా చూస్తాడన్న భరోసాతో భక్తలోకం పరవశించిపోయింది.

సోమవారం సరిగ్గా 12.29గంటలకు అభిజిత్‌లగ్నంలో ప్రధాని నరేంద్రమోదీ చేతుల మీదుగా ఈ మహోత్సవం జరిగింది. విశేషంగా హాజరైన విశిష్ట అతిథుల సమక్షంలో.. అనంత భక్తకోటి చూస్తుండంగా.. బాలరాముడి ప్రాణప్రతిష్ట దిగ్విజయంగా జరిగింది. అంతకుముందు ఈమహాక్రతువును తిలకించేందుకు సినీ రాజకీయ, క్రీడా ప్రతినిథులతో పాటు వేలమంది సాథుసంతులు తరలివచ్చారు. సుమారు 7వేలమందికి శ్రీరామతీర్థ ట్రస్ట్ ఆహ్వానాలు పంపింది. ప్రపంచంలోని టాప్‌ మోస్ట్ వీవీఐపీలు హాజరయ్యారు. యూపీ ప్రభుత్వం అతిథుల విషయంలో ముందునుంచీ చాలా పకడ్బందీ ప్రణాళికతో ఉంది. ఆహ్వానించిన అతిథులకు ఎలాంటి లోపాలు జరుగకుండా వారు తిరిగి వెళ్లే వరకు అనేక ఏర్పాట్ల చేశారు. ఇలా ప్రతివిషయంలో చాలా పక్కా ప్లాన్‌తో వెళ్లింది శ్రీరామ జన్మభూమి ట్రస్ట్. వీఐపీలు, వీవీఐపీలు, సాథుసంతులు..ఇలా ఆహ్వానాలను అందుకున్నవారిని మూడు బ్లాక్‌లుగా విభజించి..వారికి సీట్లను కేటాయించింది. దీంతో ఎలాంటి అవాంఛనీయమైన సంఘటనలు జరుగకుండా కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించారు ట్రస్ట్ నిర్వాహకులు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..