AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Elon Musk: భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం భారత్‌కు ఎలన్ మస్క్ సపోర్ట్.. సమస్య అదేనంటూ..

ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి(UNSC)లో శాశ్వత సభ్యత్వం కోసం భారత్ దశాబ్ధాలుగా డిమాండ్ చేస్తోంది. ఈ దిశగా ప్రపంచ దేశాల మద్ధతు కూడగట్టే ప్రయత్నాలను చాలా ఏళ్లుగా కొనసాగిస్తోంది. ఇప్పటికే పలు దేశాలు భారత్‌కు భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కల్పించాలన్న డిమాండ్‌కు మద్ధతు ప్రకటించాయి. అయితే భారత్ ప్రయత్నాలను చైనా వంటి కొన్ని దేశాలు దుర్భుద్ధితో అడ్డుకుంటున్నాయి.

Elon Musk: భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం భారత్‌కు ఎలన్ మస్క్ సపోర్ట్.. సమస్య అదేనంటూ..
Elon Musk, India PM Modi (File Photo)
Janardhan Veluru
|

Updated on: Jan 23, 2024 | 12:45 PM

Share

ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి(UNSC)లో శాశ్వత సభ్యత్వం కోసం భారత్ దశాబ్ధాలుగా డిమాండ్ చేస్తోంది. ఈ దిశగా ప్రపంచ దేశాల మద్ధతు కూడగట్టే ప్రయత్నాలను చాలా ఏళ్లుగా కొనసాగిస్తోంది. ఇప్పటికే పలు దేశాలు భారత్‌కు భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కల్పించాలన్న డిమాండ్‌కు మద్ధతు ప్రకటించాయి. అయితే భారత్ ప్రయత్నాలను చైనా వంటి కొన్ని దేశాలు దుర్భుద్ధితో అడ్డుకుంటున్నాయి.

తాజాగా ఈ అంశంపై ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ స్పందించారు. అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ ఉన్నప్పటికీ.. భద్రతా మండలిలో ఆ దేశానికి శాశ్వత సభ్యత్వం లేకపోవడం అసంబద్ధమని వ్యాఖ్యానించారు. ఆ మేరకు తన అభిప్రాయాన్ని X వేదికగా వెల్లడించారు. అధిక శక్తి కలిగిన వారు.. దాన్ని వదులుకునేందుకు ఇష్టపడక పోవడమే సమస్యగా మస్క్ ఎద్దేవా చేశారు. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా భద్రతా మండలిని సంస్కరించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు.

భద్రతా మండలి సంస్కరణలపై చర్చల్లో పురోగతి లేకపోవడం పట్ల పలు సందర్భాల్లో ప్రపంచ వేదికలపై భారత్ అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రస్తుతం భద్రతా మండలిలో ఐదుగురు శాశ్వత సభ్యులు, పది మంది తాత్కాలిక సభ్యులు ఉన్నారు. UN జనరల్ అసెంబ్లీ ద్వారా రెండేళ్ల కాలానికి తాత్కాలిక సభ్యులు ఎన్నుకోబడతారు. భద్రతా మండలిలో ఐదు శాశ్వత సభ్యులు-రష్యా, బ్రిటన్, చైనా, ఫ్రాన్స్, అమెరికా.. యావత్ ప్రపంచాన్ని ప్రభావితం చేసే కీలక తీర్మానంపై వీటో అధికారాన్ని కలిగి ఉన్నాయి. ఆ వీటో అధికారంతోనే భారత్‌కు భద్రతా మండలిలో శాశ్విత సభ్యత్వం కల్పించే ప్రతిపాదనలను చైనా అడ్డుకుంటోంది.

భద్రతా మండలిలో శాశ్విత సభ్యత్వం కోసం భారత్ ముమ్మర ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో భారత్‌కు సపోర్ట్‌గా ఎలన్ మస్క్ స్పందించడం ఆసక్తికరంగా మారింది. అటు అఫ్రికా దేశాలకు ఐరాస భద్రతా మండలిలో శాశ్విత సభ్యత్వం లేకపోవడం పట్ల కూడా విమర్శలు వస్తున్నాయి. 80 ఏళ్లుగా ఉన్న ప్రస్తుత భద్రతా మండలి శాశ్విత సభ్యత్వాన్ని రద్దు చేసి.. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా దాన్ని సంస్కరించాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. 130 కోట్లకు పైగా జనాభా కలిగిన భారత్‌కు భద్రతా మండలిలో శాశ్విత సభ్యత్వం లేకపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు అంతర్జాతీయ ప్రముఖులు.