క‌ర్ణాట‌క సీఎం యుడియూర‌ప్ప‌కు హైకోర్టులో ఎదురు దెబ్బ‌.. డీ నోటిఫికేష‌న్ విచార‌ణ ర‌ద్దుకు అంగీక‌రించ‌ని కోర్టు

నాయ‌క‌త్వ మార్పు ప్ర‌శ్నే లేదంటూ హైక‌మాండ్ చేసిన సూచ‌న‌ల‌తో ఊపిరి పీల్చుకున్న క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రి య‌డియూర‌ప్ప తాజాగా మ‌రో చిక్కుల్లో ప‌డ్డారు...

క‌ర్ణాట‌క సీఎం యుడియూర‌ప్ప‌కు హైకోర్టులో ఎదురు దెబ్బ‌.. డీ నోటిఫికేష‌న్ విచార‌ణ ర‌ద్దుకు అంగీక‌రించ‌ని కోర్టు
Follow us
Subhash Goud

|

Updated on: Dec 24, 2020 | 2:04 PM

నాయ‌క‌త్వ మార్పు ప్ర‌శ్నే లేదంటూ హైక‌మాండ్ చేసిన సూచ‌న‌ల‌తో ఊపిరి పీల్చుకున్న క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రి య‌డియూర‌ప్ప తాజాగా మ‌రో చిక్కుల్లో ప‌డ్డారు. బెళ్లందూరు డీ నోటిఫికేష‌న్ విచార‌ణ ర‌ద్దుకు హైకోర్టు అంగీక‌రించ‌లేదు. బెంగ‌ళూరులోని బెళ్లందూరు, దేవ‌ర బీస‌న‌హ‌ళ్లిలో ఐటీ కారిడార్ కోసం క‌ర్ణాట‌క పారిశ్రామిక‌ ప్ర‌దేశాభివృద్ధి మండ‌లి స్వాధీనం చేసుకున్న భూముల‌ను య‌డియూర‌ప్ప ప్ర‌భుత్వం గ‌తంలో డీ నోటిఫై చేసిన విష‌యం తెలిసిందే.

అయితే ఈ వ్య‌వ‌హారంలో భారీ కుంభ‌కోణం జ‌రిగిందంటూ లోకాయుక్త‌కు ఆర్‌టీఐ కార్య‌క‌ర్త వాసుదేవ‌రెడ్డి ఫిర్యాదు చేశారు. అయితే త‌న‌పై లోకాయుక్త కోర్టులో ఉన్న కేసును ర‌ద్దు చేయాలంటూ 2019లో యడియూర‌ప్ప హైకోర్టును ఆశ్ర‌యించారు. ఈ వ్య‌వ‌హారంలో తాజాగా ఆయ‌న‌కు చుక్కెదురైంది. కోర్టు ప‌ర్య‌వేక్ష‌ణ‌లోనే ఈ కేసు విచార‌ణ జ‌ర‌గాల‌ని ధ‌ర్మాస‌నం పేర్కొంది. 2008-11 మ‌ధ్య కాలంలో యడియూర‌ప్ప ఈ కేసు కార‌ణంగా ముఖ్య‌మంత్రి ప‌ద‌విని కోల్పోవ‌డంతో పాటు జైలు పాలైన విష‌యం తెలిసిందే.