Karnataka Election Results: కన్నడ కాంగ్రెస్‌లో ఖుషీ టైమ్స్… సిద్ధ అండ్ డీకే క్యాంపుల్లో పార్టీ టైమ్స్
కళ్లలో కసి.. కడుపు నిండా ఆకలి.. రెండూ కలిస్తే మనిషిని పోరాటం వైపు నడిపిస్తుంది. చావోరేవో అనేంతలా కమిట్‌మెంట్ పెరుగుతుంది. రాజకీయాల్లో కూడా అంతే. కన్నడ నాట కాంగ్రెస్‌ని ముందుకు నడిపించి.. ఆఖరి పోరాటంలో నెగ్గేలా చేసింది కూడా ఈ పోరాట పంథానే. ఇవాళ్టి..
కళ్లలో కసి.. కడుపు నిండా ఆకలి.. రెండూ కలిస్తే మనిషిని పోరాటం వైపు నడిపిస్తుంది. చావోరేవో అనేంతలా కమిట్‌మెంట్ పెరుగుతుంది. రాజకీయాల్లో కూడా అంతే. కన్నడ నాట కాంగ్రెస్‌ని ముందుకు నడిపించి.. ఆఖరి పోరాటంలో నెగ్గేలా చేసింది కూడా ఈ పోరాట పంథానే. ఇవాళ్టి ఈ విజయదరహాసం వెనుక కాంగ్రెస్‌లో పెద్ద కథే నడిచింది. కన్నడనాట కాంగ్రెస్ పార్టీకి విక్టరీ వేవ్ ఎలా వచ్చిన్నట్టు. బీజేపీని వెనక్కు తోసిన ప్రతికూల అంశాలు ఏంటన్నట్టు?
ఇంకేముంది ఐపాయ్ అనుకుంటున్న సమయంలో.. లడ్డూలాంటి జోకర్ ముక్క దొరికింది కాంగ్రెస్ పార్టీకి. కన్నడనాట కలిసికట్టుగా పనిచేసి కమలం పార్టీకి షాకిచ్చేసినందుకు అంబరాన్నంటిన సంబరాలు.. ఆనందభాష్పాలు.. అక్కడక్కడా ఎమోషనల్ సీన్లు కూడా. ఖర్గే ఫ్యాక్టర్, రాహుల్ చరిష్మా, డీకే మార్క్ ఆఫ్ ఎలక్షనీరింగ్, పెరిగిన పెట్రోల్ రేట్లు, బీజేపీలో పేరుకుపోయిన అవినీతి అండ్ అసమ్మతి. ఇలా కర్నాటకలో కాంగ్రెస్‌కి లైఫ్ రావడానికి చాలానే కారణాలున్నాయి. బీజేపీ మైనస్‌లని తమకు ప్లస్‌లుగా మార్చుకోవడంలో సక్సెస్ కొట్టారు కాంగ్రెస్ లీడర్లు. కేంద్రంలో మోడీ పట్ల నెగిటివిటీ ఉందో లేదో గానీ.. కర్నాటకలో బొమ్మై సర్కార్ మీదైతే టన్నులకొద్దీ వ్యతిరేకతుంది జనంలో. ఆ వ్యతిరేకతే తమ పట్ల అనుకూలతగా మారిపోయిందని కాంగ్రెస్ నేతలే చెప్పుకుంటున్నారు.. ఒప్పుకుంటున్నారు.
కర్నాటకలో బీజేపీని ఎవరు లీడ్ చేయాలి.. ఎవరిని సీఎంగా ఎలివేట్ చేయాలి అనే కన్‌ఫ్యూజన్ కూడా కాంగ్రెస్ పార్టీకి ఎడ్వాంటేజ్‌గా మారింది. ప్రచారంలో యడ్యూరప్ప పేరైనా సోయిలో లేదు. ఇప్పుడున్న సీఎం బస్వరాజ్ బొమ్మైని రిపీట్ చేస్తారన్న మాట కూడా వినిపించలేదు. పైగా.. ఉన్న సీనియర్లంతా పక్కకు తప్పుకున్నారు. బీజేపీ బ్యాక్‌బోన్‌లలో ఒకరైన గాలి జనార్థన్‌రెడ్డి కూడా సొంత కుంపటి పెట్టుకున్నారు. దీంతో కన్నడ జనం కాంగ్రెస్ వైపు చూసేందుకు బీజేపీయే ఛాన్సిచ్చినట్టయింది.
హిందూ ఓటుబ్యాంకు మీద ఓవర్‌గా ఫోకస్ పెట్టడం. హిజాబ్-హలాల్, టిప్పుసుల్తాన్, ముస్లిం కోటా.. లాంటి మతపరమైన అంశాల చుట్టూనే రాజకీయాలు నడపడం బీజేపీకి బూమరాంగ్ ఐంది. కాంగ్రెస్‌కి ఇది కూడా ప్లస్ అయింది. కర్నాటక మిల్క్ ఫెడరేషన్‌ను అమూల్ కంపెనీలో విలీనం చేస్తారన్న వందతులు.. కాంగ్రెస్ పార్టీకి ఆయుధాలుగా మారాయి. మా నందిని పాలు మాక్కావాలె.. మీ గుజరాత్ అమ్యూల్‌ని వెనక్కు తీసుకెళ్లండి అంటూ బీజేపీ మీదకు లోకల్ సెంటిమెంట్‌ని ఇంజెక్ట్ చెయ్యగలిగింది కన్నడ కాంగ్రెస్.
విక్టరీ గ్యారంటీ అంటూ విశ్లేషణలు గట్టిగా చెప్పడంతో కాంగ్రెస్‌లో సీఎం సీటు కోసం పోటీ పెరిగింది. పెద్ద కుర్చీ దక్కుతుందన్న ఆశతో పీసీసీ చీఫ్ డీకే శివకుమార్, మాజీ సీఎం సిద్ధరామయ్య ఇద్దరూ పోటీపడి పనిచేశారు. గతంలో భిన్నధృవాల్లా కనిపించిన వీళ్లిద్దరూ ఎలక్షన్స్ టైమ్‌లో అపూర్వ సహోదరుల్లా మారారు.
అటు.. మల్లికార్డున ఖర్గే కోసం సీఎం ఛాన్స్‌ని త్యాగం చేస్తున్నామంటూ దళిత ముఖ్యమంత్రి అనే కొత్త కార్డును కూడా ప్లే చేశారు. కన్నడనాట అరాచకవాదిగా మారిందన్న కారణంతో భజరంగ్ భలిని నిషేధించాలన్న కఠిన నిర్ణయాలు కూడా తీసుకుంది. మొదట్లో భజరంగ్‌భలి ఇష్యూ రివర్స్ అవుతుందనుకున్నా.. దీన్ని ఓవర్‌గా ఎక్స్‌పోజ్ చేసిన బీజేపీనే దెబ్బతీసింది. అటు.. పూర్తిగా డిఫెన్స్‌లో పడ్డ బీజేపీని ఇంకాస్త ఇరకాటంలో పెడుతూ మేనిఫెస్టోను కూడా ఉచిత హామీలతో నింపేసింది కాంగ్రెస్ పార్టీ. పేదల పక్షపాతులమంటూ కొత్త స్లోగన్ అందుకుంది. పూర్ పాపులేషన్ ఎక్కువగా ఉండే హైదరాబాద్-కర్నాటక, బాంబే-కర్నాటక, సెంట్రల్ కర్నాటకలపై స్పెషల్‌గా ఫోకస్ చేసింది కాంగ్రెస్ పార్టీ. 200 యూనిట్ల వరకూ ఉచిత కరెంట్.. మహిళలకు-యువతకు నగదు బదలీ, పది కిలోల ఉచిత బియ్యం.. ఇవన్నీ పేదల ఓట్లను కాంగ్రెస్ వైపు తిప్పేశాయి.
బీజేపీ కూడా జనరంజకమైన మేనిఫెస్టోతో జనంలోకెళ్లినా.. ఎడ్వాంటేజ్ మాత్రం కాంగ్రెస్ పార్టీకేనంటూ మొదటినుంచీ ఎనాలసిస్‌లు మొదలయ్యాయి. కొన్ని ముందస్తు సర్వేలు కూడా కాంగ్రెస్‌కే ఎడ్జ్ అంటూ ఓపెన్‌గా చెప్పేశాయి. ఈ మొత్తం పరిణామం కర్నాటకలో కాంగ్రెస్ వేవ్‌ని క్రియేట్ చేసి.. విక్టరీ వైపు నడిపించేసింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి