IPS Praveen Sood: సీబీఐ నూతన డైరెక్టర్‌గా ఐపీఎస్ ప్రవీణ్ సూద్.. కర్ణాటక డీజీపీ నుంచి..
సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) నూతన డైరెక్టర్‌గా సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ ప్రవీణ్ సూద్‌ను కేంద్రం నియమించింది. ప్రధానమంత్రి, భారత ప్రధాన న్యాయమూర్తి, లోక్‌సభ ప్రతిపక్ష నేతతో కూడిన ఉన్నతస్థాయి కమిటీ కర్ణాటక డీజీపీగా ఉన్న ప్రవీణ్‌సూద్‌ను ఎంపిక చేసింది. బాధ్యతలు చేపట్టిననాటి నుంచి రెండేళ్ల పాటు ప్రవీణ్ సూద్ సీబీఐ డైరెక్టర్‌గా కొనసాగనున్నారు.
సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) నూతన డైరెక్టర్‌గా సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ ప్రవీణ్ సూద్‌ను కేంద్రం నియమించింది. ప్రధానమంత్రి, భారత ప్రధాన న్యాయమూర్తి, లోక్‌సభ ప్రతిపక్ష నేతతో కూడిన ఉన్నతస్థాయి కమిటీ కర్ణాటక డీజీపీగా ఉన్న ప్రవీణ్‌సూద్‌ను ఎంపిక చేసింది. బాధ్యతలు చేపట్టిననాటి నుంచి రెండేళ్ల పాటు ప్రవీణ్ సూద్ సీబీఐ డైరెక్టర్‌గా కొనసాగనున్నారు. ఈనెల 25వ తేదీన సీబీఐ డెరెక్టర్‌గా పదవీ బాధ్యతలు స్వీకరిస్తారు. ప్రధాని మోడీ, సీజేఐ చంద్రచూడ్, లోక్‌సభలో విపక్ష నేత అధిర్ రంజన్ చౌదరి నేతృత్వంలోని కమిటీ.. నూతన సీబీఐ డెరెక్టర్‌ను ఎంపిక చేసింది. ప్రస్తుతం ఉన్న సీబీఐ డైరెక్టర్ సుబోధ్ కుమార్ జైస్వాల్ పదవీకాలం మే 25తో ముగియనుంది. ఈ నేపథ్యంలో సీబీఐ నూతన డైరెక్టర్ నియామకానికి ప్రధానమంత్రి, సీజేఐ, లోక్‌సభలోని ప్రతిపక్ష నేతతో కూడిన ఉన్నతస్థాయి కమిటీ.. శనివారం సమావేశమై ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారుల పేర్లను పరిశీలించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. వీరిలో కర్ణాటక డీజీపీ ప్రవీణ్ సూద్, మధ్యప్రదేశ్ డీజీపీ సుధీర్ సక్సేనా, తాజ్ హసన్‌ల పేర్లు పరిశీలనకు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే, అత్యున్నత స్థాయి కమిటీ ఆయన వైపే మొగ్గుచూపింది. సీబీఐ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన నాటినుంచి ప్రవీణ్‌సూద్ రెండేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగుతారని కేంద్ర ప్రభుత్వం ఆదివారం ఓ ప్రకటనలో వెల్లడించింది. అయితే, ఈ పదవీ కాలాన్ని ఐదేళ్ల వరకు పొడిగించవచ్చు.
Praveen Sood has been appointed as the Director of the Central Bureau of Investigation (CBI) for a period of two years: CBI pic.twitter.com/9Wv5MlNoLp
ఇవి కూడా చదవండి— ANI (@ANI) May 14, 2023
1986 బ్యాచ్ కర్ణాటక క్యాడర్‌కు చెందిన ప్రవీణ్ సూద్ ప్రస్తుతం ఆ రాష్ట్ర డీజీపీగా ఉన్నారు. అయితే, ముందుగా ఊహించినట్లుగానే కర్ణాటక డీజీపీ ప్రవీణ్ సూద్ సీబీఐ నూతన డైరెక్టర్‌గా ఎంపికైనట్లు పేర్కొంటున్నారు. ఇదిలాఉంటే, కర్నాటక ఎన్నికల సమయంలో రాష్ట్రంలో కాంగ్రెస్ నేతలపై ఉద్దేశపూర్వకంగా కేసులు నమోదు చేస్తున్నారంటూ.. డీజీపీ ప్రవీణ్ సూద్‌పై కాంగ్రెస్ రాష్ట్ర చీఫ్ డీకే శివకుమార్ పలు ఆరోపణలు చేశారు. అయితే, తాజాగా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీపై కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన మరుసటి రోజే సీబీఐ డైరెక్టర్‌గా ప్రవీణ్ సూద్ ఎంపిక కావడం చర్చనీయాంశంగా మారింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం..