AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Karnataka CM Post: ఆ ఇద్దరిలో.. కర్ణాటక సీఎం ఎవరు..? 18న ప్రమాణం చేయనున్న నూతన కేబినెట్..

కర్నాటక కొత్త సీఎం ఎవరన్న విషయంపై సస్పెన్స్‌ కొనసాగుతోంది. బెంగళూర్‌లో సీఎల్పీ సమావేశం జరుగుతోంది. హైకమాండ్‌ దూతగా మహారాష్ట్ర మాజీ సీఎం సుశీల్‌కుమార్‌ షిండే హాజరవుతున్నారు. ఎమ్మెల్యేల అభిప్రాయాలను పార్టీ అధిష్టానానికి నివేదిస్తారు షిండే. హోటల్‌ శాంగ్రిల హోటల్‌కు చేరుకున్నారు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు.

Karnataka CM Post: ఆ ఇద్దరిలో.. కర్ణాటక సీఎం ఎవరు..? 18న ప్రమాణం చేయనున్న నూతన కేబినెట్..
Siddaramaiah, Dk Shivakumar
Shaik Madar Saheb
|

Updated on: May 14, 2023 | 7:09 PM

Share

కర్నాటక కొత్త సీఎం ఎవరన్న విషయంపై సస్పెన్స్‌ కొనసాగుతోంది. బెంగళూర్‌లో సీఎల్పీ సమావేశం జరుగుతోంది. హైకమాండ్‌ దూతగా మహారాష్ట్ర మాజీ సీఎం సుశీల్‌కుమార్‌ షిండే హాజరవుతున్నారు. ఎమ్మెల్యేల అభిప్రాయాలను పార్టీ అధిష్టానానికి నివేదిస్తారు షిండే. హోటల్‌ శాంగ్రిల హోటల్‌కు చేరుకున్నారు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు. అయితే, సీఎం పదవి కోసం సిద్దరామయ్య , డీకే శివకుమార్‌ మధ్య పోటీ మరింత ముదిరింది. ఈ క్రమంలో కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే ఢిల్లీకి చేరుకున్నారు. సోనియాగాంధీ, రాహుల్‌తో సమావేశమయ్యారు. కొత్త సీఎం ఎంపికపై చర్చించారు. ఎమ్మెల్యేల సమావేశం తరువాతనే సీఎం అభ్యర్ధిపై నిర్ణయం ఉంటుందని ఖర్గే తెలిపారు. సీఎల్పీ భేటీకి ముగ్గురు పరిశీలకులను నియమించామన్నారు ఖర్గే. ఎమ్మెల్యేల అభిప్రాయాన్ని పరిశీలకులు సేకరిస్తారని, ఆతరువాత హైకమాండ్‌కి ఎమ్మెల్యేల అభిప్రాయాన్ని నివేదిస్తారన్నారు. ఆ తర్వాత సీఎం ఎంపికను హైకమాండ్‌ నిర్ణయిస్తుందన్నారు.

ఈ క్రమంలో డీకే శివకుమార్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను గతంలో సిద్దరామయ్య కేబినెట్‌లో మంత్రిగా పనిచేశానని, పార్టీ కోసం ఎన్నో త్యాగాలు చేశానని అన్నారు. ఇప్పుడు కూడా సిద్దరామయ్యకు పూర్తిగా సహకరిస్తానని తెలిపారు. తుముకూరు లోని సిద్దగంగా మఠాన్ని సందర్శించారు శివకుమార్‌. వొక్కలిగ మఠాధిపతులంతా డీకే శివకుమార్‌ను సీఎం చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.

ఇదిలాఉంటే.. 18న కర్ణాటక నూతన సీఎం ప్రమాణ స్వీకారం ఉండనుంది. అదేరోజు కేబినెట్ మంత్రులు కూడా ప్రమాణం చేయనున్నారు. ఈ ప్రమాణ స్వీకారానికి సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతోపాటు.. పలు రాష్ట్రాలకు చెందిన విపక్ష పార్టీల ముఖ్యమంత్రులు హాజరుకానున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం..

Follow Us
గుడ్లు ఉడికించేటప్పుడు దీన్ని వేస్తే పొట్టు ఈజీగా వచ్చేస్తుంది..
గుడ్లు ఉడికించేటప్పుడు దీన్ని వేస్తే పొట్టు ఈజీగా వచ్చేస్తుంది..
విద్యార్ధులకు అలర్ట్.. ఇక ఇంటర్‌ మార్కుల మెమోపై ఇక 11 అంకెల PEN
విద్యార్ధులకు అలర్ట్.. ఇక ఇంటర్‌ మార్కుల మెమోపై ఇక 11 అంకెల PEN
42 బంతుల్లో సెంచరీ.. రోహిత్, విరాట్ సరసన టీమిండియా కెప్టెన్
42 బంతుల్లో సెంచరీ.. రోహిత్, విరాట్ సరసన టీమిండియా కెప్టెన్
కొనసాగుతున్న నైరుతి నిష్క్రమణ.. తెలుగురాష్ట్రాల్లో వెదర్ ఎలా...
కొనసాగుతున్న నైరుతి నిష్క్రమణ.. తెలుగురాష్ట్రాల్లో వెదర్ ఎలా...
మనల్ని ఇతరులతో పోల్చుకోకూడదు.. హంసను చూసి అసూయపడిన కాకి కథ
మనల్ని ఇతరులతో పోల్చుకోకూడదు.. హంసను చూసి అసూయపడిన కాకి కథ
ఇంటి వద్దకే బస్సు.. బస్టాండ్ వరకు అక్కర్లేదు.. ఆర్టీసీ డెసిషన్..
ఇంటి వద్దకే బస్సు.. బస్టాండ్ వరకు అక్కర్లేదు.. ఆర్టీసీ డెసిషన్..
ఆరు ఓటీటీల్లో మలయాళం సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ..
ఆరు ఓటీటీల్లో మలయాళం సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ..
ద్వాదశి శ్రాద్ధం ఎందుకు ప్రత్యేకం? సన్యాసి శ్రాద్ధం అని ఎందుకు..
ద్వాదశి శ్రాద్ధం ఎందుకు ప్రత్యేకం? సన్యాసి శ్రాద్ధం అని ఎందుకు..
నిమ్మరసం ఇలా తాగితేనే అసలైన ఫలితం.. మీకు తెలియని సీక్రెట్స్..
నిమ్మరసం ఇలా తాగితేనే అసలైన ఫలితం.. మీకు తెలియని సీక్రెట్స్..
డిగ్రీ మార్కులతో కెనరా బ్యాంకులో 3,500 ఉద్యోగాలు..రాత పరీక్ష లేదు
డిగ్రీ మార్కులతో కెనరా బ్యాంకులో 3,500 ఉద్యోగాలు..రాత పరీక్ష లేదు