Karnataka Assembly: కర్నాటక అసెంబ్లీలో తొలిరోజే చిత్రవిచిత్రమైన దృశ్యాలు.. 24 గంటల్లోనే ఉద్యోగికి షాక్..
కర్నాటక అసెంబ్లీలో తొలిరోజే చిత్రవిచిత్రమైన దృశ్యాలు కన్పించాయి. కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు విధానసౌద ప్రాంగణాన్ని గోమూత్రంతో శుద్ది చేశారు. ఆ తరువాతే అసెంబ్లీ హాల్‌లోకి ప్రవేశించారు. గత బీజేపీ ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని, అందుకే అసెంబ్లీని శుద్ది చేసినట్టు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చెబుతున్నారు. ఇకపోతే..

కర్నాటక అసెంబ్లీలో తొలిరోజే చిత్రవిచిత్రమైన దృశ్యాలు కన్పించాయి. కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు విధానసౌద ప్రాంగణాన్ని గోమూత్రంతో శుద్ది చేశారు. ఆ తరువాతే అసెంబ్లీ హాల్‌లోకి ప్రవేశించారు. గత బీజేపీ ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని, అందుకే అసెంబ్లీని శుద్ది చేసినట్టు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చెబుతున్నారు. ఇకపోతే.. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అందరితో సరదాగా గడిపారు. అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేలతో ఆయన ముచ్చటించారు. మాజీ సీఎం బస్వరాజ్ బొమ్మై సహా తదితరులతో కలిసి సెల్ఫీ దిగారు. అసెంబ్లీకి వచ్చే ముందు డీకే శివకుమార్ బీజేపీ సీనియర్ నేత ఎస్‌ఎం కృష్ణ దంపతుల ఆశీర్వాదం తీసుకున్నారు. ఎస్‌ఎం కృష్ణ ఆయనకు దగ్గరి బంధువు. డీకే కూతురిని ఎస్‌ఎం కృష్ణ మనవడు పెళ్లాడారు. అసెంబ్లీలో తొలిరోజు కొత్త ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం జరిగింది.
ఇదిలాఉంటే.. ప్రభుత్వం ఏర్పడిన ఆదిలోనే ఓ ప్రభుత్వ ఉద్యోగికి షాక్ ఇచ్చారు సీఎం సిద్ధరామయ్య. ఉచిత పథకాలను విమర్శిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన టీచర్‌ను.. సస్పెండ్ చేశారు. ఆ టీచర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన 24 గంటల్లోనే సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది సర్కార్. సంతానమూర్తి అనే టీచర్.. ఉచిత పథకాలను విమర్శిస్తూ పోస్టులుపెట్టారు. ఉచిత పథకాల వల్ల రాష్ట్రంపై అధిక భారం పడుతోందని కామెంట్ చేశారు. గతంలో సిద్ధరామయ్య హయాంలో రూ.2.42 లక్షల కోట్లకు అప్పు పెరిగిందని ట్వీట్ చేశారు. కర్ణాటకలో గత సీఎంల హయాంలో ఉన్న అప్పులనూ ప్రస్తావించారు సదరు టీచర్. సంతానమూర్తి చిత్రదుర్గ జిల్లాలో టీచర్‌గా పనిచేస్తుండగా.. ఆయనపై చర్యలు తీసుకుంది కర్నాటక ప్రభుత్వం.




మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..