Censor: ఇకపై ఆ ఆటలు సాగవు.. సినీ మేకర్స్‌కి శంకరాచార్య పీఠం అల్టిమేటం. ధరమ్ సెన్సార్ బోర్డ్ పేరుతో.
హైందవ ధర్మాన్ని కించపరుస్తూ సినిమాలు సినిమాలు తెరకెక్కించే వారికి శంకరాచార్య పీఠం అల్టీమేటం జారీ చేసింది. సినిమాలు, ఓటీటీల్లో ప్రసారమయ్యే వెబ్ సిరీస్‌లో హైందవ ధర్మాన్ని కించపరుస్తూ సన్నివేశాలను చిత్రీకరించడం ఇకపై కుదరదంటూ ఉత్తర ప్రదేశ్‌లోని లక్నోకు చెందిన శంకరాచార్య జ్యోతిష్య పీఠాధి..
హైందవ ధర్మాన్ని కించపరుస్తూ సినిమాలు సినిమాలు తెరకెక్కించే వారికి శంకరాచార్య పీఠం అల్టీమేటం జారీ చేసింది. సినిమాలు, ఓటీటీల్లో ప్రసారమయ్యే వెబ్ సిరీస్‌లో హైందవ ధర్మాన్ని కించపరుస్తూ సన్నివేశాలను చిత్రీకరించడం ఇకపై కుదరదంటూ ఉత్తర ప్రదేశ్‌లోని లక్నోకు చెందిన శంకరాచార్య జ్యోతిష్య పీఠాధి తపతి స్వామి అవిముక్తేశ్వరనంద్ తెలిపారు. ఇందులో భాగంగా ధరమ్ సెన్సార్ బోర్డ్ ఏర్పాటు చేసినట్టు ప్రకటించారు. ఒకరి మత మనోభావాలు దెబ్బ తీసేలా కంటెంట్ తెరకెక్కించాలనుకునే వాళ్లకు కళ్లెం వేయాలనేదే ఈ ధరమ్ సెన్సార్ బోర్డ్ ముఖ్య ఉద్దేశ్యం అని ఆయన చెప్పారు.
ఈ ఆదివారం ధరమ్ సెన్సార్ బోర్డ్‌ను హరిద్వార్‌లో ఏర్పాటు చేసినట్టు స్వామి ముక్తేశ్వరనంద్ చెప్పుకొచ్చారు. ధరమ్ సెన్సార్ బోర్డ్‌ను ’ధరమ్ శోధన్ సేవాలయా’ పిలవాలని తెలిపారు. సెన్సార్ బోర్డ్ కార్యాలయాన్ని జనవరి 15వ తేదీన దేశ రాజధాని ఢిల్లీలో ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. బోర్డ్ నియమ నిబంధనలను జనవరి 19న మాఘ మేళాలో ప్రకటించినట్టు చెప్పుకొచ్చారు. ఈ సెన్సార్ బోర్డులో 10 మంది సభ్యులు ఉండనున్నారని సమమాచారం. దక్షిణాది విషయానికొస్తే తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో సెన్సార్ బోర్డ్ ఆఫీసులను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పుకొచ్చారు. పురాణాలు, ఇతిహాసలపై సినిమాలు, సీరియల్స్ తీయాలనుకుంటే తమ పీఠం సలహాలు, సూచనలు కూడా ఇస్తుందని తెలిపారు.
ఈ సెన్సార్ బోర్డ్ హిందూ సంస్కృతిని కించపరిచేలా ఉన్న కంటెంట్‌ను పరిశీలించి తప్పులు లేకుండా సలహాలు ,సూచనలు చేస్తామని తెలిపారు. మరి ఈ సెన్సార్ బోర్డ్ నిర్ణయంపై ఫిలిమ్ మేకర్స్ ఎలా స్పందిస్తారో చూడాలి. ఇదిలా ఉంటే తాజాగా పఠాన్ మూవీపై ఎంతటి చర్చ జరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హీరోయిన్ దీపికా ధరించిన బికినీ రంగుపై హైందవ వాదులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమాను ఎట్టి పరిస్థితుల్లో విడుదల చేయనివ్వమని హైందవ సంస్థలు హెచ్చరించాయి.
మరిన్ని సినిమా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..