AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bombay High Court: వివాదాస్పద తీర్పులిచ్చిన జస్టిస్ పదోన్నతికి ఎసరు.. పదవీ కాలం మరో ఏడాది పొడిగింపు..

Judge Pushpa Virendra Ganediwala: బాంబే హైకోర్టు నాగ్‌పూర్ బెంచ్ జడ్జి జ‌స్టిస్ పుష్ప గ‌నేదివాలా.. బాలిక‌ల‌పై లైంగిక‌ దాడి కేసుల్లో వివాదస్పదమైన తీర్పులిచ్చి  దేశవ్యాప్తంగా సంచలనం..

Bombay High Court: వివాదాస్పద తీర్పులిచ్చిన జస్టిస్ పదోన్నతికి ఎసరు.. పదవీ కాలం మరో ఏడాది పొడిగింపు..
Shaik Madar Saheb
|

Updated on: Feb 14, 2021 | 2:34 AM

Share

Judge Pushpa Virendra Ganediwala: బాంబే హైకోర్టు నాగ్‌పూర్ బెంచ్ జడ్జి జ‌స్టిస్ పుష్ప గ‌నేదివాలా.. బాలిక‌ల‌పై లైంగిక‌ దాడి కేసుల్లో వివాదాస్పదమైన తీర్పులిచ్చి  దేశవ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఆ తీర్పులు ఇప్పుడు గనేదివాలా పదోన్నతికి అడ్డుగా మారాయి. జస్టిస్‌ పుష్ప పదవీ కాలాన్ని అదే స్థాయిలో మరో ఏడాది పాటు కొనసాగిస్తూ కేంద్ర న్యాయశాఖ తాజాగా నోటిఫికేషన్‌ జారీ చేసింది. సాధారణంగా అదనపు న్యాయమూర్తి పదవీకాలం రెండేళ్లే ఉంటుంది. ఆ తర్వాత శాశ్వత న్యాయమూర్తిగా పదోన్నతి కల్పిస్తారు. అదనపు న్యాయమూర్తిగా జస్టిస్‌ పుష్ప తన రెండేళ్ల పదవీకాలాన్ని ఈ శుక్రవారంతో పూర్తి చేసుకున్నారు. కానీ ఆమెను అదే స్థానంలో ఉంచుతూ.. మరో ఏడాది పాటు పదవీకాలాన్ని పొడిగిస్తూ కేంద్రం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.

వాస్తవానికి జస్టిస్‌ పుష్పను బాంబే హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా సుప్రీం కొలీజియం గతంలో సిఫారసు చేసింది. ఈ క్రమంలో గతనెలలో లైంగిక వేధింపుల కేసుల్లో పుష్ప వెలువరించిన రెండు తీర్పులు తీవ్రంగా వివాదాస్పదమయ్యాయి. దీంతో సుప్రీం కొలీజియం సిఫారసును వెనక్కి తీసుకుని.. ఆమెను మరో రెండేళ్లపాటు అదనపు న్యాయమూర్తిగానే కొనసాగించాలని పేర్కొంది. అయితే సుప్రీం సిఫారసులను పరిగణలోకి తీసుకున్న కేంద్రం ప్రభుత్వం.. ఆమె పదవీకాలాన్ని ఏడాది పాటే పొడిగిస్తూ.. నిర్ణయం తీసుకుంది.

Also Read:

పశ్చిమ బెంగాల్ లో అధికారం మాదే, తృణమూల్ కాంగ్రెస్ నేత అభిషేక్ బెనర్జీ, వారికి సింగిల్ డిజిటే

‘మాతా పిత పూజా దినోత్సవం’గా వేలంటైన్స్ డే, శ్రీరామ్ సేన నినాదం, పబ్ లు, పార్కులపై నిఘా