Maharashtra: తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే అంతే.. లాతూర్‌లో ఏడుగురు ఉద్యోగుల జీతంలో కోత.. ఎంతంటే..?
Maharashtra Latur Zilla Parishad: నేటి సమాజంలో చాలామంది కుమారులు తమకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తూ బాధపెడుతున్న సంఘటనలు అనేకం చూస్తూనే ఉన్నాం. వృద్ధాప్యంలో మగ్గుతూ.. ఎన్నో
Maharashtra Latur Zilla Parishad: నేటి సమాజంలో చాలామంది కుమారులు తమకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తూ బాధపెడుతున్న సంఘటనలు అనేకం చూస్తూనే ఉన్నాం. వృద్ధాప్యంలో మగ్గుతూ.. ఎన్నో బాధలు అనుభవిస్తున్న తల్లిదండ్రుల ఆలనా పాలనను నూటికి 60శాతం మంది పట్టించుకోవడం లేదు. అలాంటి వారిలో ఉద్యోగులు సైతం ఉన్నారు. ఇలాంటి ఘటనలపై మహారాష్ట్ర లాతూర్ అధికారులు సీరియస్ అయ్యారు. తల్లిదండ్రులను పట్టించుకోని ఏడుగురు ఉద్యోగుల జీతాల్లో కోత విధించారు. తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసిన ఉద్యోగుల జీతాల్లో 30శాతం కోత విధించినట్లు లాతూర్ జిల్లా పరిషత్ అధ్యక్షుడు రాహుల్ బొంద్రే శనివారం తెలిపారు. ఆ నగదును వారి తల్లిదండ్రుల ఖాతాల్లో జమ చేసినట్లు ఆయన వెల్లడించారు. తెలిపారు.
ఇటీవల 12మంది ఉద్యోగుల నుంచి తమకు ఫిర్యాదులు అందాయని బొంద్రే పేర్కొన్నారు. ఈ ఉద్యోగుల్లో ఆరుగురు ఉపాధ్యాయులు ఉన్నట్లు ఆయన తెలిపారు. అనంతరం 5గురు తమ తల్లిదండ్రులను బాగా చూసుకుంటున్నారని తెలిపారు. పట్టించుకోని మిగతా ఏడుగురి జీతంలో కొత విధిస్తున్నట్లు వెల్లడించారు. గతేడాది నవంబరులో దీనికి సంబంధించిన బిల్లుకు మహారాష్ట్ర సర్కారు ఆమోదం తెలపగా.. డిసెంబరు నుంచి అమలు చేస్తున్నారు.
Also Read: