Indian Navy: టెన్త్, ఇంటర్ అర్హతతో ఇండియన్ నేవీలో ఉద్యోగాలు.. స్పోర్ట్స్ కోటాలో సెయిలర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..
Indian Navy Recruitment 2021: ఇండియన్ నేవీ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. ఇండియన్ నేవీలో 2021 సంవత్సరానికి సంబంధించి పలు పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఇందుకు...
Indian Navy Recruitment 2021: ఇండియన్ నేవీ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. ఇండియన్ నేవీలో 2021 సంవత్సరానికి సంబంధించి పలు పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఇందుకు స్పోర్ట్స్ కోటా ద్వారా అర్హులైన అవివాహిత పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నేవీ విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. పలు విభాగాల్లో 10, ఇంటర్ అర్హతతో స్పోర్ట్స్ కోటాలో పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు అర్హత కలిగిన అభ్యర్థులు ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేది మార్చి 7. పూర్తి వివరాల కోసం అభ్యర్థులు joinindiannavy.gov.in అధికారిక వెబ్‌సైట్‌లో చూడవచ్చు.
డెరెక్ట్ ఎంట్రీ పెటీ ఆఫీసర్ అర్హత: ఇంటర్మీడియట్ లేదా పదో తరగతి ఉత్తీర్ణత ఉండాలి. కోర్సు మొదలయ్యే నాటికి అభ్యర్ధులు 17-22 ఏళ్ల మధ్య ఉండాలి. స్పోర్ట్స్: అంతర్జాతీయ/ జాతీయ/ రాష్ట్ర స్థాయి సీనియర్/ జూనియర్ టీమ్ గేమ్స్, వ్యక్తిగత అంశాల్లోనైనా పాల్గొని ఉండాలి.
సీనియర్ సెకండరీ రిక్రూట్(SSR) అర్హత: ఇంటర్మీడియట్ లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణత. దరఖాస్తు చేసే అభ్యర్ధులు కోర్సు మొదలయ్యే నాటికి 17-21 ఏళ్ల మధ్య ఉండాలి. స్పోర్ట్స్: అంతర్జాతీయ/జాతీయ/రాష్ట్ర స్థాయి/యూనివర్సిటీలో నిర్వహించే ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్లలో పాల్గొని ఉండాలి.
మెట్రిక్ రిక్రూట్స్(MR) అర్హత: పదో తరగతి లేదా తత్సమాన ఉత్తీర్ణత కలిగి ఉండాలి. కోర్సు మొదలయ్యే నాటికి అభ్యర్ధులు 17-21 ఏళ్ల మధ్య ఉండాలి. స్పోర్ట్స్ ప్రొఫిషియన్సీ: అంతర్జాతీయ/జాతీయ/రాష్ట్ర స్థాయి టోర్నమెంట్లలో పాల్గొని ఉండాలి. వయసు: కోర్సు మొదలయ్యే నాటికి అభ్యర్ధులు 17-21 ఏళ్ల మధ్య ఉండాలి లేదా 01.04.2000 – 31.03.2004 మధ్య జన్మించి ఉండాలి.
ఎంపిక విధానం: అర్హులైన అభ్యర్థుల్ని సంబంధిత నేవల్ సెంటర్స్‌లో ట్రయల్స్ నిర్వహిస్తారు. ట్రయల్స్‌లో అర్హత సాధించిన వారికి ఐఎన్ఎస్ హమ్లా, ముంబయిలో మెడికల్ టెస్ట్ అనంతరం ట్రైనింగ్ ప్రక్రియ ఉంటుంది. దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా మార్చి 7 నాటికి దరఖాస్తు చేసుకోవాలి. శిక్షణ సమయంలో నెలకు రూ.14,600 స్టేఫండ్ ఇస్తారు.
Also Read: