CBSE Exams: సీబీఎస్ఈ 10, 12వ తరగతుల ప్రైవేటు విద్యార్థులకు మరో అవకాశం.. పరీక్ష రిజిస్ట్రేషన్ గడువు పెంపు..
CBSE Board Exam 2021: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) 10, 12వ తరగతులు చదువుతున్న ప్రైవేటు విద్యార్థులు.. పరీక్షలకు దరఖాస్తు చేసుకోవడానికి..
CBSE Board Exam 2021: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) 10, 12వ తరగతులు చదువుతున్న ప్రైవేటు విద్యార్థులు.. పరీక్షలకు దరఖాస్తు చేసుకోవడానికి గడువు తేదీని పొడిగించింది. పరీక్షల కోసం అప్లై చేయని విద్యార్థులకు మరో అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రైవేటు విద్యార్థుల ఫిబ్రవరి 22 నుంచి 25వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు సీబీఎస్ఈ వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని వెల్లడించింది. ప్రైవేటు విద్యార్థుల నుంచి వస్తున్న ఫిర్యాదుల మేరకు మరో మూడు రోజులపాటు పొడిగించాలని సీబీఎస్ఈ బోర్డు నిర్ణయించింది. దరఖాస్తు చేసే విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ cbse.nic.in లో లాగిన్ అయి పూర్తి చేయాలని అధికారులు వెల్లడించారు.
సీబీఎస్ఈ 2021 పరీక్షలకు సిద్ధమవుతున్న ప్రైవేట్ విద్యార్థులు సకాలంలో పరీక్షల కోసం రిజిస్ట్రేషన్ చేసుకోలేకపోయారని.. ఈ క్రమంలో చాలా మంది నుంచి అభ్యర్థనలు వచ్చాయని సీబీఎస్ఈ వెల్లడించింది. దీనిపై సమీక్షించిన అనంతరం 10, 12 తరగతుల విద్యార్థులకు మరో అవకాశాన్ని ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే సీబీఎస్ 10, 12 వ తరగతి బోర్డు పరీక్షలు మే 4 నుంచి జూన్ 10 వరకు జరగనున్నాయి. అంతేకాకుండా మార్చినుంచి ప్రాక్టికల్ పరీక్షలు కూడా నిర్వహించనున్నారు.
Also Read: