Risk of Sinking: జోషిమఠ్ ఒక్కటేకాదు.. ప్రమాదంలో మరో ఆరు పట్టణాలు.. సంచలనంగా మారిన రిపోర్ట్స్..

భూ అంతర్భాగాలను చీల్చడం.. భూగర్భ జలాలను తోడేయడం.. విద్యుత్‌ ఉత్పత్తి, భారీ కట్టడాలు నిర్మించడం.. ఇవన్నీ కలిపి జోషిమఠ్‌ను పెను ప్రమాదంలోకి నెట్టివేశాయి.

Risk of Sinking: జోషిమఠ్ ఒక్కటేకాదు.. ప్రమాదంలో మరో ఆరు పట్టణాలు.. సంచలనంగా మారిన రిపోర్ట్స్..
Joshimath Cracks
Follow us
Shiva Prajapati

|

Updated on: Jan 14, 2023 | 11:12 AM

భూ అంతర్భాగాలను చీల్చడం.. భూగర్భ జలాలను తోడేయడం.. విద్యుత్‌ ఉత్పత్తి, భారీ కట్టడాలు నిర్మించడం.. ఇవన్నీ కలిపి జోషిమఠ్‌ను పెను ప్రమాదంలోకి నెట్టివేశాయి. ఆ ఒక్క గ్రామానికే కాదు పర్వత శ్రేణులను ఆనుకుని ఉన్న గ్రామాలన్నీ ఇప్పుడు డేంజర్‌ జోన్‌లో పడ్డాయి. తాజాగా ఇస్రో రిలీజ్ చేసిన చిత్రాలు మరింత కలవరపెడుతున్నాయి.

హిమాలయన్‌ టౌన్‌ జోషిమఠ్‌ కుంగిపోతోంది. ఇళ్లు, రోడ్లకి బీటలు వారుతుంటే.. పెద్ద పెద్ద చెట్లు నేలలో కూరుకుపోతున్నాయి. కరెంట్‌ స్తంభాలు విరుగుతున్నాయి. భూగర్భం నుంచి నీళ్లు ఉబికి వస్తున్నాయి. ఈ పరిణామాలన్నీ స్థానిక ప్రజల్ని.. అక్కడి ప్రభుత్వానికి కునుకు లేకుండా చేస్తున్న వేళ.. ఇస్రో విడుదల చేసిన చిత్రాలు మరింత దడ పుట్టించాయి.

జోషి మఠ్ ప్రాంతం 12 రోజుల్లో 5.4 సెంటీమీటర్లు భూమిలోకి కుంగిపోయినట్టు ఇస్రో చిత్రాలు వెల్లడిస్తున్నాయి. అలాగే చుట్టుపక్కల ప్రాంతాలు ఏటా 2.5 అంగుళాల మేర భూమిలోకి దిగిపోతున్నట్లు డెహ్రడూన్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రిమోట్‌ సెన్సింగ్‌ ఐడెంటిఫై చేసింది. జులై 2020 నుంచి మార్చి 2022 వరకు ఉపగ్రహ చిత్రాలను విశ్లేషించి.. ఇక్కడి లోయ ప్రదేశం మొత్తం మెల్లిమెల్లిగా కుంగిపోతున్నట్టు గుర్తించింది. ఇదే ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది.

ఇవి కూడా చదవండి

జోషిమఠ్‌ మాత్రమే కాదూ చుట్టుపక్కల ప్రాంతాలకు కూడా ముప్పు పొంచి ఉంది. పౌరి, ఉత్తరకాశీ, బాగేశ్వర్‌, టిహరి గడ్వాల్‌, రుద్రప్రయాగ్‌లు డేంజర్‌ జోన్‌లో ఉన్నాయి. ఈ వార్తలతో ఆయా ప్రాంతాల ప్రజలు వణికిపోతున్నారు. పౌరి, రుద్రప్రయాగ్‌లలో రైల్వే ప్రాజెక్ట్‌ల కారణంగా కొండ చరియలు విరిగిపడుతున్నాయి. ఇళ్లకు పగుళ్లు ఏర్పడుతున్నాయి. మరోవైపు టన్నెల్ కోసం పేలుళ్లు కూడా మరో ప్రధాన కారణంగా కనిపిస్తోంది. నిజానికి 50ఏళ్ల క్రితమే మిశ్రా కమిటీ నివేదిక ఇచ్చింది. ఈ ప్రాంతం డేంజర్‌ జోన్‌లోకి వెళ్తుందని హెచ్చరించింది. కానీ పాలకులు పెద్దగా పట్టించుకోలేదు. ఆ నిర్లక్ష్యమే ఇప్పుడు దేవభూమి పాతాళంలోకి కుంగిపోయేలా చేసిందన్న వాదనలు వినిపిస్తున్నాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!