Online Gambling: ఆన్‌లైన్‌ రమ్మీ ఆడి 41 మంది మృతి.. ఆన్‌లైన్‌ గ్యామ్లింగ్‌ నిషేధించాలంటూ డిమాండ్‌! పట్టించుకోని సర్కార్

ఆన్‌లైన్‌ రమ్మీ నిషేధించాలంటూ పీఎంకే అధ్యక్షుడు డాక్టర్‌ అన్బుమణి రాందాస్‌ శుక్రవారం నాడు (జనవరి 13) డిమాండ్‌ చేశారు. ఇప్పటి వరకు ఆన్‌లైన్‌ రమ్మీ కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 41 మంది..

Online Gambling: ఆన్‌లైన్‌ రమ్మీ ఆడి 41 మంది మృతి.. ఆన్‌లైన్‌ గ్యామ్లింగ్‌ నిషేధించాలంటూ డిమాండ్‌! పట్టించుకోని సర్కార్
Online Gambling
Follow us

|

Updated on: Jan 14, 2023 | 10:58 AM

తమిళనాడులో ఆన్‌లైన్‌ రమ్మీ నిషేధించాలంటూ పీఎంకే అధ్యక్షుడు డాక్టర్‌ అన్బుమణి రాందాస్‌ శుక్రవారం నాడు (జనవరి 13) డిమాండ్‌ చేశారు. ఇప్పటి వరకు ఆన్‌లైన్‌ రమ్మీ కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 41 మంది చనిపోయారని ఆయన అన్నారు. ఈ ఆన్‌లైన్‌ గేమ్‌ వల్ల ఇంతమంది మరణిస్తున్నా.. దానిని నిషేధించేందుకు గవర్నర్‌ అంబుమని రాందాస్‌కు మనసు రావడం లేదని ఆయన విమర్శించారు. తూత్తుకుడిలో ఆన్‌లైన్‌ రమ్మీ కారణంగా రూ.3.5 లక్షలు పోగొట్టుకున్న బాలన్‌ అనే ఇంజనీర్‌ ఆత్మహత్యకు పాల్పడ్డాడంపై ఆయన విమర్శలు గుప్పించారు. ఆన్‌లైన్‌ గ్యామ్లింగ్‌ ద్వారా రూ.15 లక్షలు పొగొట్టుకుని డిప్రెషన్‌లోకి వెళ్లిన శివన్‌రాజ్‌ (34) అనే మరో యువకుడు మంగళవారం ఆత్మహత్య చేసుకున్నాడు.

రాష్ట్రంలో వరుస ఆత్మహత్యలకు కారణమవుతున్న ఆన్‌లైన్‌ గేమ్‌లను నిషేధించాలని, ఇంకెంత మంది ప్రాణాలు కోల్పోతే గవర్నర్‌ మనసు కరుగుతుందో అర్థం కావడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా గవర్నర్‌ ఆన్‌లైన్‌ రమ్మీ నిషేధ చట్టానికి ఆమోదం తెలపాలని అన్బుమణి డిమాండ్‌ చేశారు. కాగా ఆన్‌లైన్‌ గ్యాంబ్లింగ్‌ నిషేధ చట్టాన్ని తమిళనాడు హైకోర్టు 2021 ఆగస్టు 3న రద్దు చేసిన విషయం తెలిసిందే. నాటి నుంచి ఎందరో యువకులు ఆన్‌లైన్‌ గ్యామ్లింగ్‌ ఉచ్చులో చిక్కుకుని డిప్రెషన్‌లోకి కూరుకుపోతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.