కరుడుగట్టిన ఉగ్రవాది అరెస్ట్

లష్కరే తోయిబాకి చెందిన మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది జమాల్ దిన్ గుజ్జార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతడి తలపై రూ.5 లక్షల రివార్డు కూడా ఉంది. జమ్ముకశ్మీర్ రాష్ట్రం లోని దోడ జిల్లాలో ఉగ్రవాదులు సంచరిస్తున్నారన్న పక్కా సమాచారంతో జమ్ము పోలీసులు, రిజర్వుడు పోలీసులు సంయుక్తంగా కూంబింగ్ చేపట్టారు. తనిఖీలు చేపడుతున్న సమయంలో కేశ్వాన్ పట్టణానికి చెందిన ఖైరుద్దీన్ కుమారుడు జమాల్ దిన్ గుజ్జార్ ఆయుధాలతో అడవుల్లో సంచరిస్తుండగా పోలీసులు అతన్ని పట్టుకున్నారు. జమాల్ దిన్ గుజ్జార్ […]

కరుడుగట్టిన ఉగ్రవాది అరెస్ట్
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jul 25, 2019 | 8:56 AM

లష్కరే తోయిబాకి చెందిన మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది జమాల్ దిన్ గుజ్జార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతడి తలపై రూ.5 లక్షల రివార్డు కూడా ఉంది. జమ్ముకశ్మీర్ రాష్ట్రం లోని దోడ జిల్లాలో ఉగ్రవాదులు సంచరిస్తున్నారన్న పక్కా సమాచారంతో జమ్ము పోలీసులు, రిజర్వుడు పోలీసులు సంయుక్తంగా కూంబింగ్ చేపట్టారు. తనిఖీలు చేపడుతున్న సమయంలో కేశ్వాన్ పట్టణానికి చెందిన ఖైరుద్దీన్ కుమారుడు జమాల్ దిన్ గుజ్జార్ ఆయుధాలతో అడవుల్లో సంచరిస్తుండగా పోలీసులు అతన్ని పట్టుకున్నారు. జమాల్ దిన్ గుజ్జార్ ఏడాది కాలంగా లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థలో పనిచేస్తున్నాడని పోలీసులు తెలిపారు. ఇతడి వద్ద నుంచి భారీగా మందు గుండు సామాగ్రితో పాటు, ఏకే 47, ఉగ్రవాదానికి సంబంధించిన మ్యేగజైన్, బుల్లెట్లు, ఆహార పదార్ధాలు స్వాధీనం చేసుకున్నారు. కాగా, జూన్ 22న జరిగిన ఎన్‌కౌంటర్‌లో జమాల్ తీవ్రంగా గాయపడి.. తప్పించుకున్నాడు. అప్పటి నుంచి అటవీప్రాంతంలో నక్కాడని తెలిపారు.