AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కర్ణాటక సీన్ రిపీట్ చేస్తారా..? చూపుతా నా తడాఖా..

కర్ణాటకలో ఇటీవల జరిగిన సీన్‌కి.. రివర్స్ సీన్ మధ్యప్రదేశ్‌లో జరిగింది. ఆ రాష్ట్రంలో కాంగ్రెస్, జేడీఎస్ ప్రభుత్వాన్ని కుప్పకూల్చడానికి బీజేపీ.. చాపకింద నీరులా ప్రయత్నాలు చేస్తే.. మధ్యప్రదేశ్‌లో బీజేపీని నీరుగార్చడానికి కాంగ్రెస్ పన్నాగం పన్నింది. సీన్ కట్ చేస్తే… మా పైవారు ఆదేశిస్తే… 24 గంటలు చాలు.. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలడం ఖాయం. ఇలా వ్యాఖ్యానించింది ఎవరో కాదు.. ఆ రాష్ట్రానికి చెందిన కమలం పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే. అదిష్టానం నుంచి ఆదేశాలు వస్తే.. […]

కర్ణాటక సీన్ రిపీట్ చేస్తారా..? చూపుతా నా తడాఖా..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 25, 2019 | 7:34 PM

Share

కర్ణాటకలో ఇటీవల జరిగిన సీన్‌కి.. రివర్స్ సీన్ మధ్యప్రదేశ్‌లో జరిగింది. ఆ రాష్ట్రంలో కాంగ్రెస్, జేడీఎస్ ప్రభుత్వాన్ని కుప్పకూల్చడానికి బీజేపీ.. చాపకింద నీరులా ప్రయత్నాలు చేస్తే.. మధ్యప్రదేశ్‌లో బీజేపీని నీరుగార్చడానికి కాంగ్రెస్ పన్నాగం పన్నింది. సీన్ కట్ చేస్తే…

మా పైవారు ఆదేశిస్తే… 24 గంటలు చాలు.. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలడం ఖాయం. ఇలా వ్యాఖ్యానించింది ఎవరో కాదు.. ఆ రాష్ట్రానికి చెందిన కమలం పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే. అదిష్టానం నుంచి ఆదేశాలు వస్తే.. కర్ణాటకలో కుప్పకూలినట్లు ప్రభుత్వం పడిపోయి.. బీజేపీ పవర్‌లోకి వస్తుందంటూ గోపాల్ భార్గవ అనే ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు మధ్యప్రదేశ్ రాజకీయంలో పెనుదుమారం రేపాయి.

అయితే మధ్యప్రదేశ్ సీఎం కమల్ నాథ్.. ఆ బీజేపీ నేతలకు షాక్ ఇచ్చారు. తమ ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా లేదని సీఎం అన్నారు. అంతేకాదు.. తమవైపు ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారంటూ వ్యాఖ్యానించారు. అంతేకాదు మధ్యప్రదేశ్ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ఓ బిల్లుకు కూడా వారు మద్ధతిచ్చినట్లు తెలుస్తోంది.

బుధవారం మధ్యప్రదేశ్ అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన శిక్షాస్మృతి సవరణ బిల్లుకు మద్దతుగా ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలు నారాయణ్ త్రిపాఠి, శరద్ కౌల్ ఓటు వేశారు. అయితే ఇప్పుడు ఆ ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలను.. కాంగ్రెస్ తనవైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. తమకు అనుకూలంగా ఓటేసిన ఆ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ ఎవరికి తెలియని ప్రదేశంలో గోప్యంగా ఉంచినట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాదు ఇవాళ సీఎం ఇచ్చే విందుకు కూడా ఆ ఎమ్మెల్యేలు హాజరుకానున్నట్లు పుకార్లు వస్తున్నాయి. కర్ణాటక జరిగిన పరిణామాలను దృష్టిలో ఉంచుకుని.. కాంగ్రెస్ పార్టీ ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలను కాపాడుకోవాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పుడు ఆ ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలు ఎటువైపుంటారనేది ఆసక్తి రేపుతోంది.

Follow Us
గణపతి నిమజ్జనం, అనంత చతుర్దశి ఒకే రోజున ఎందుకు? అసలు కారణం ఇదే!
గణపతి నిమజ్జనం, అనంత చతుర్దశి ఒకే రోజున ఎందుకు? అసలు కారణం ఇదే!
డబ్బుకు కొదవ ఉండకూడదా? ఇంట్లో ఈ వస్తువులు ఉంచండి!
డబ్బుకు కొదవ ఉండకూడదా? ఇంట్లో ఈ వస్తువులు ఉంచండి!
బంధువుల ఇంటికి వెళ్తున్నారా? చాణక్యుడు చెప్తోన్న టిప్స్ ఇవే..
బంధువుల ఇంటికి వెళ్తున్నారా? చాణక్యుడు చెప్తోన్న టిప్స్ ఇవే..
ప్రజలకు తెలంగాణ సర్కార్ అదిరే దసరా గిఫ్ట్.. వచ్చే నెలలోనే..
ప్రజలకు తెలంగాణ సర్కార్ అదిరే దసరా గిఫ్ట్.. వచ్చే నెలలోనే..
ఖైరతాబాద్ బడా గణేష్ భక్తులకు లాస్ట్ ఛాన్స్.. నిమజ్జనం ఎప్పుడంటే?
ఖైరతాబాద్ బడా గణేష్ భక్తులకు లాస్ట్ ఛాన్స్.. నిమజ్జనం ఎప్పుడంటే?
మహిళలు శ్రాద్ధం, పిండ ప్రదానం చేయవచ్చా? గరుడ పురాణం ఏం చెబుతుంది?
మహిళలు శ్రాద్ధం, పిండ ప్రదానం చేయవచ్చా? గరుడ పురాణం ఏం చెబుతుంది?
ఈయన ఒక దేశ మాజీ ప్రధాని అంటే నమ్ముతారా? స్టేషన్‌ లో ఇలా..!
ఈయన ఒక దేశ మాజీ ప్రధాని అంటే నమ్ముతారా? స్టేషన్‌ లో ఇలా..!
జపాన్‌తో మ్యాచ్‌లో ఊహించని డ్రామా.. అంపైర్‎ను బెదిరించి గెలిచారా
జపాన్‌తో మ్యాచ్‌లో ఊహించని డ్రామా.. అంపైర్‎ను బెదిరించి గెలిచారా
72వ జాతీయ చలనచిత్ర అవార్డులు.. విజేతలుగా నిలిచింది వీరే..
72వ జాతీయ చలనచిత్ర అవార్డులు.. విజేతలుగా నిలిచింది వీరే..
హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం.. ఉరుములు, మెరుపులు...
హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం.. ఉరుములు, మెరుపులు...